తెలంగాణలోని జనగామ జిల్లా పెంబర్తిలో బంగారు ఆభరణాలతో నిండిన లంకెబిందెలు బయటపడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన నర్సింహ పెంబర్తిలో 11 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఆ స్థలాన్ని వెంచర్‌గా మార్చేందుకు చదును చేస్తుండగా బండ రాళ్ల సమీపంలో లంకెబిందె లభ్యం అయ్యింది. దానిలో సుమారు 19 తులాల బంగారం, 1.7 కిలోల వెండి ఉండటంతో నర్సింహ అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని అధికారులకు సమాచారమందించాడు.
ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. లంకెబిందె దొరికిందని తెలియడంతో... దాన్ని చూసేందుకు గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆభరణాలు కాకతీయులకాలం నాటివి అని... ఇంకా తవ్వకాలు చేపడితే మరిన్ని గుప్త నిధులు దొరికే అవకాశం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదీ చదవండీ.. 'ఎమ్మెల్యే ఫేక్ ఎఫ్బీ క్రియేట్.. ఆపై డిమాండ్'