కరోనా నియంత్రణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి మాజీ ఎంపీ, లైలా గ్రూప్ సంస్థల ఛైర్మన్ గోకరాజు గంగరాజు కోటి రూపాయల విరాళం అందజేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ విరాళం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. సంబంధించిన చెక్ ను భాజపా ఏపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ కు అందజేశారు. కరోనా వైరస్ కారణంగా దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో తనవంతుగా ఈ సహాయానికి ముందుకు వచ్చానన్నారు.
ఇదీ చదవండి: