ETV Bharat / city

GRMB MEETING: 'గెజిట్‌ నోటిఫికేషన్‌లో సవరణలు చేశాకే ముందడుగేద్దాం' - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

water boar meeting
water boar meeting
author img

By

Published : Aug 3, 2021, 12:03 PM IST

Updated : Aug 4, 2021, 5:48 AM IST

12:00 August 03

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు శ్రీకారం చుడదామని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సూచించాయి. అయితే అందులో సవరణలు చేయాలని, ఆ తర్వాతే ముందడుగు వేద్దామని ఏపీ తన అభిప్రాయాన్ని స్పష్టంచేసింది. ముఖ్యమంత్రితో చర్చించాక దీనిపై కేంద్ర జలశక్తిశాఖకు లేఖ రాస్తామని అధికారులు తెలిపారు.

water boar meeting

గెజిట్ నోటిఫికేషన్‌పై తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు కృష్ణా, గోదా వరి బోర్డులు సమన్వయ కమిటీల సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. అయినా తెలంగాణ నుంచి సమన్వయ కమిటీ సమావేశానికి ఎవరూ హాజరు కాలేదు. బోర్డు కార్యాలయాలతో పాటు తెలంగాణ నీటిపారుదల, పరిపాలనా విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయాలు కూడా జలసౌధ భవనంలోనే ఉన్నప్పటికీ తెలంగాణ నుంచి ఎవరూ సమావేశంలో పాల్గొనలేదు. చివరికి రెండు బోర్డులూ..ఆంధ్రప్రదేశ్ అధికారులతోనే చర్చించాయి. గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలపై మొదట బోర్డులు ప్రజంటేషన్ ఇచ్చాయి. నోటిఫికేషన్‌లోని అంశాలు అమలులోకి తేవడానికి ఏం చేయాలి? ఏ తేదీలోగా రాష్ట్రాలు ఏం చేయాలనే దానిపై బోర్డు కార్యదర్శులు వివరించారు. ఆగస్టు 15లోగా ప్రాజెక్టుల వారీగా సిబ్బంది వివరాలు అందజేయాలని, ఒక్కో బోర్డుకు 200 కోట్ల చొప్పున డబ్బు డిపాజిట్ చేయడం గురించి నిర్ణయం చెప్పాలని బోర్డు అధికారులు కోరారు.

  గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు నిర్ణీత గడువులోగా సిబ్బంది, ప్రాజెక్టుల వివరాలు, నిధులు, కేంద్ర బలగాల నియామకం తదితర అంశాలపై వివరాలు అందజేయాలని.. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు కోరాయి. అయితే నోటిఫికేషన్లోని రెండో షెడ్యూలు ప్రాజెక్టులపై కొన్ని అభ్యంతరాలున్నాయని, ఇందుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాస్తామని ఏపీ సమాధానమిచ్చింది. ఏయే అంశాల్లో ప్రాజెక్టుల్లో మార్పులు చేయాలని కోరుకుంటున్నారని బోర్డు అధికారులు ప్రశ్నించగా, వివరాలు ప్రస్తుతం చెప్పలేమని, ఉన్నతాధికారులు, న్యాయ బృందం, ముఖ్యమంత్రితో చర్చించాకే లేఖ రాస్తామని తెలిపారు.

   గెజిట్ నోటిఫికేషన్‌ను స్వాగతించినా ... కొన్ని మార్పులు చేయాలని కోరనున్నామని, అవి చేశాకే కార్యాచరణపై ముందుకు వెళ్తామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. సవరణలు వచ్చే వరకూ ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ అమలులో ఉన్నట్లే కాబట్టి అప్పటివరకూ దీని ప్రకారమే ముందుకెళ్తామని బోర్డు అధికారులు సూచించారు. గోదావరిలో దిగువన ఉన్న, ఏ రాష్ట్రంతో సంబంధం లేని సీలేరు జల విద్యుత్‌ కేంద్రాన్ని బోర్డు పరిధిలో చేర్చడంపై ఏపీ జెన్‌కో ఎండీ శ్రీధర్ ప్రశ్నించినట్లు తెలిసింది.Spot

   ప్రభుత్వంతో చర్చించి నిర్ణయానికి అనుగుణంగా బోర్డులు కోరిన సమాచారం ఇస్తామని ఏపీ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్......... నారాయణ రెడ్డి చెప్పారు. గోదావరిలో ఎలాంటి సమస్యలు లేనప్పుడు బోర్డు పరిధిలోకి ఎందుకన్న ప్రశ్నకు స్పందించిన ఈఎన్​సీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందన్నారు. గోదావరిలో 1,430 టీఎంసీల నీటి లభ్యత ఉంటే వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల కింద తెలంగాణలో..1,355 టీఎంసీల నీటి వినియోగం జరగనుందన్నారు. దీనివల్ల దిగువన ఉన్న గోదావరి డెల్టా, పోలవరం లాంటి ప్రాజెక్ట్‌కు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని ఏపీ ఎన్​ఈసీ(AP ENC) అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

 krishna water disputes : కృష్ణా జలాల వివాదం.. ఏపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

Last Updated : Aug 4, 2021, 5:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.