ETV Bharat / city

వరద సన్నద్ధత ఏదీ?

Godavari flood equipment tenders: గోదావరి వరద ముంచెత్తుతున్నా ఇప్పటికీ జలవనరులశాఖ అందుకు సన్నద్ధంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం గోదావరి వరదను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఇంజినీర్లు, అధికారులు కూడా లేరు. వరద వచ్చే సమయానికి సిద్ధం చేసుకోవాల్సిన సామగ్రినీ అధికారులు సమకూర్చలేదు.

Godavari flood equipment tenders are still not done
వరద సన్నద్ధత ఏదీ
author img

By

Published : Jul 14, 2022, 7:33 AM IST

Godavari flood equipment tenders: గోదావరి వరద ముంచెత్తుతున్నా ఇప్పటికీ జలవనరులశాఖ అందుకు సన్నద్ధంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. జలవనరుల శాఖలో ఇటీవల జరిగిన బదిలీలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. ప్రలోభాలతో ఇంజినీర్లను బదిలీ చేశారనే ఆరోపణలు రేగాయి. ప్రస్తుతం గోదావరి వరదను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఇంజినీర్లు, అధికారులు కూడా లేరు. వరద వచ్చే సమయానికి సిద్ధం చేసుకోవాల్సిన సామగ్రినీ అధికారులు సమకూర్చలేదు.

ఇప్పటికే గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి వరద ప్రవహిస్తోంది. ఇసుక బస్తాలు, సర్వే బద్దల్లాంటి సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. ఇప్పటివరకు ఇందుకోసం టెండర్లు పిలిచే ప్రక్రియ కూడా చేపట్టలేదని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. గోదావరి హెడ్‌ వర్క్సుకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు ఉండాలి. ఆయననే వరద కన్జర్వేటర్‌గా పిలుస్తారు. బ్యారేజి నిర్వహణ బాధ్యత ఆయనదే. తాజా బదిలీల్లో ఆయనకు స్థానచలనం కలిగింది. ఆయన స్థానంలో వేరే ఈఈని నియమించలేదు. ప్రస్తుతం అక్కడ డీఈఈ అదనపు బాధ్యతలతో ఆ విధులు నిర్వహిస్తున్నారు.

ఇటీవలి వరకు ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజికి ఎస్‌ఈగా ఉన్న అధికారిని అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారు. గోదావరి బ్యారేజిలో డ్రెడ్జింగ్‌ టెండర్ల విషయంలో పైనుంచి సూచించిన గుత్తేదారుకు పనులు అప్పచెప్పాలనే ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ ఎస్‌ఈ వ్యక్తిగత సెలవులో వెళ్లిపోయారనే విమర్శలున్నాయి. తర్వాత అక్కడ రెగ్యులర్‌ ఎస్‌ఈని నియమించలేదు. సెలవుపై వెళ్లిన ఎస్‌ఈని వేరే జిల్లాలో అప్రాధాన్య పోస్టులో నియమించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈగా ఉన్న నరసింహమూర్తి ధవళేశ్వరం బ్యారేజికి ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పోలవరంలో ఉన్న అధికారుల్లో ఎవరికీ అదనపు బాధ్యతలు ఇవ్వవద్దని పోలవరం అథారిటీ చెబుతోంది. పోలవరంలో దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం సకాలంలో పూర్తి చేయలేకపోయారు. దీంతో పనిచేసుకునేందుకు అనువైన స్థలాన్ని కాపాడుకోలేకపోయారు. పోలవరం వద్ద వరద నేపథ్యంలో స్పిల్‌ వే, ఇతరత్రా అనేక అంశాల పర్యవేక్షణ కీలకం. అలాంటి అధికారికి గోదావరి డెల్టా ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

మరోవైపు గోదావరి డెల్టా సీఈగా రెగ్యులర్‌ అధికారి లేరు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (పాలన)కు ఆ పోస్టులో అదనపు బాధ్యతలు అప్పగించారు. కీలకమైన మధ్య డెల్టా, తూర్పు డెల్టా ఈఈలనూ తాజాగా బదిలీ చేసి, కొత్తగా ఎవరినీ నియమించలేదు. కొన్ని డీఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆఫీసు పోస్టులకే గిరాకీ.. తాజాగా రాష్ట్రంలోని పరిస్థితుల నేపథ్యంలో చాలామంది జలవనరులశాఖ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పని చేసేందుకు విముఖంగా ఉన్నారని చెబుతున్నారు. నిధులు సకాలంలో రాకపోవడం, బిల్లులు పెండింగులో ఉండటం, న్యాయస్థానాల్లో కేసులు ఎదుర్కోవాల్సి రావడంతో ఆఫీసు పోస్టులు, నాణ్యత నియంత్రణ విభాగం పోస్టులకు ఏదోలా ప్రయత్నించుకుని వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.