ETV Bharat / city

తెలంగాణ: నేరెడ్‌మెట్‌ బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యం - news on medchala girl missed

తెలంగాణ మేడ్చల్‌ జిల్లా నేరేడ్‌మెట్‌లో అదృశ్యమైన బాలిక నాలాలో విగతజీవిగా బయటపడింది. సైకిల్‌పై బయటికి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

girl body found nala in neredmet
నేరెడ్‌మెట్‌ బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యం
author img

By

Published : Sep 18, 2020, 1:36 PM IST

తెలంగాణ మేడ్చల్‌ జిల్లా నేరేడ్‌మెట్‌లో 12 ఏళ్ల బాలిక అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. నిన్న సాయంత్రం అదృశ్యమైన బాలిక... నాలాలో విగతజీవిగా బయటపడింది. కాకతీయనగర్​కు చెందిన ఐదో తరగతి చదువుతున్న 12 ఏళ్ల సుమేధ కపురియా.. నిన్న సాయంత్రం అదృశ్యమైంది. సైకిల్‌పై బయటికి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

బాలిక మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించగా సైకిల్​పై వెళ్తున్నట్లు గుర్తించారు. జీహెచ్​ఎంసీ బృందాల గాలింపు చర్యల్లో... నాలాలో సైకిల్ దొరికింది. భారీ వర్షానికి దీన్ దయాల్ నగర్ నాలా పొంగిపొర్లడంతో బాలిక ప్రమాదవశాత్తు పడిపోవచ్చని అనుమానంతో నాలాలో సెర్చ్‌ ఆపరేషన్స్‌ చేపట్టారు. రెస్క్యూ బృందాల గాలింపులో బండ చెరువు వద్ద నాలాలో బాలిక మృతదేహం బయటపడింది.

బాలిక సైకిల్​ తొక్కుతున్న దృశ్యాలు

ఇదీ చదవండి: కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.