హైదరాబాద్‌లోని జియాగూడకి చెందిన అలివేలు ఐదేళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నది. ఆమె భర్త శ్రీశైలం కూరగాయల మార్కెట్లో కూలీగా పని చేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా చాలామంది ఉపాధి లేక ఇంటికే పరిమితమై... తిండికి సైతం ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ఆహారం, సరుకులు అందిస్తున్నది. తన వంతు సాయంగా అలివేలు తనకు వచ్చే జీతం రూ.12000 నుంచి 10వేల రూపాయలు మంత్రి కేటీఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించి తన పెద్ద మనసును చాటుకుంది.
ఆమె యోగక్షేమాలు కనుక్కున్న మంత్రి కేటీఆర్... ఏ సహాయం కావాలన్నా అండగా ఉంటానని చెప్పారు. ఏదో ఆశించి ఈ పని చేయలేదని.. కష్టకాలంలో ఇతరులకు తన వంతు సహకారంగా చేశానని అలివేలు చెప్పింది. తనకు వచ్చిన జీతంలోంచి అధిక మొత్తం ఆకలితో ఉన్నవారికి అందించే గుణం అందరికీ ఉండదని, అలివేలుది గొప్ప మనస్తత్వమని మంత్రి కేటీఆర్ ఆమెను అభినందించారు.
ఇవీచూడండి: కొహెడ పండ్ల మార్కెట్‌ను పరిశీలించిన మంత్రులు