ETV Bharat / city

జీహెచ్‌ఎంసీ కొత్త పాలకమండలికి సంక్రాంతి తర్వాత గెజిట్ నోటిఫికేషన్!

బల్దియా కొత్త పాలకమండలి గెజిట్ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఎన్నికల అధికారి నుంచి వివరాలు అందిన నేపథ్యంలో సంబంధిత ప్రక్రియను ఎస్ఈసీ ప్రారంభించింది. వచ్చే నెల పదో తేదీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీకి అనుగుణంగా పాలకమండలి మొదటి సమావేశం జరగనుంది.

ghmc new governing body
జీహెచ్‌ఎంసీ కొత్త పాలకమండలికి సంక్రాంతి తర్వాత గెజిట్ నోటిఫికేషన్
author img

By

Published : Jan 9, 2021, 9:04 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన తుది ప్రక్రియ ప్రారంభమైంది. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన 150 మంది కార్పొరేటర్ల జాబితాను ఎన్నికల అధికారి అయిన జీహెచ్ఎంసీ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించారు. దీంతో తదుపరి ప్రక్రియను ఎస్ఈసీ ప్రారభించింది. ఎన్నికైన అభ్యర్థులకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది. బల్దియా ప్రస్తుత పాలకమండలి పదవీకాలం వచ్చే నెల పదో తేదీతో ముగియనుంది. ఆ తేదీకి 30 రోజుల ముందుగా అంటే ఈ నెల పదో తేదీ తర్వాత గెజిట్ ఇస్తారు.

సంక్రాంతి తర్వాత

సంక్రాంతి సెలవుల దృష్ట్యా ఈ నెల 15వ తేదీ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు సంబంధిత ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. కొత్త పాలకమండలి మొదటి సమావేశ తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. నూతన పాలకమండలిని సమావేశపరిచేందుకు నోటిఫికేషన్ జారీ చేసి... మేయర్ ఎన్నిక కోసం కలెక్టర్​ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ ఎన్నిక చేపడతారు. మేయర్ ఎన్నిక కోసం ఎన్నికైన, ఎక్స్ ఆఫీషియో సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది కోరం తప్పనిసరి. సరిపడా కోరం ఉంటే చేతులెత్తే విధానంలో మేయర్ ఎన్నిక చేపట్టి ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు.

సమానంగా ఓట్లు వస్తే

ఎన్నికకు పార్టీల విప్​లు వర్తిస్తాయి. ఎవరైనా విప్ ఉల్లంఘిస్తే వారి ఓటు చెల్లుబాటు అవుతుంది. వారిపై సంబంధిత పార్టీల ఫిర్యాదుకు అనుగుణంగా అనర్హత వేటు పడుతుంది. ఇద్దరు లేదా ఎక్కువ మంది అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మేయర్ ఎన్నిక పూర్తి అయితేనే డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపడతారు. ఒకవేళ మేయర్ ఎన్నికకు సరిపడా కోరం లేకపోతే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. రెండో రోజు కూడా కోరం లేకపోతే ఎన్నిక ప్రక్రియను వాయిదా వేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఆ తర్వాత మేయర్ ఎన్నిక కోసం ఎస్ఈసీ మళ్లీ తేదీని ఖరారు చేసి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ తేదీ రోజు కోరంతో సంబంధం లేకుండా మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు.

ఇదీ చదవండి:

11న మంత్రులు, కలెక్టర్లతో సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.