ETV Bharat / city

'ట్రేస్‌, టెస్ట్‌, ట్రీట్​తో కరోనాను నిలువరించగలం' - జర్మనీ వైద్య నిపుణులు

సత్వర పరీక్షలు నిర్వహించి.. అత్యవసర వైద్యం అందించి..మూకుమ్మడి వ్యూహంతో ప్రపంచ దేశాలకు ఆ దేశం ఆదర్శంగా నిలిచింది. ట్రేస్‌, టెస్ట్‌, ట్రీట్‌ విధానంతో విజయవంతంగా కరోనాను నిలువరించగలమని చెప్తున్న జర్మనీ వైద్య నిపుణురాలు మరియ చెన్నమనేనితో 'ఈనాడు' ముఖాముఖి.

germany-succeeded-to-control-corona-virus-in-their-country
జర్మనీ వైద్య నిపుణురాలు మరియ
author img

By

Published : Apr 17, 2020, 4:56 PM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటున్న దేశాల్లో జర్మనీ ఒకటి. మొదట్లో కేసులు ఎక్కువగా నమోదైనా.. ధైర్యంగా వైరస్‌ను నియంత్రించడం వల్ల ఆ దేశం ముందంజలో నిలుస్తోంది. జర్మనీలో ఏప్రిల్‌ 14 నాటికి 1.3 లక్షల కేసులు నమోదైతే అందులో సగం మంది కోలుకున్నారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు, వైద్యవిధానాలు, ప్రజాచైతన్యం కారణంగానే కరోనా కట్టడి అవుతోందని జర్మనీకి చెందిన వైద్య నిపుణురాలు డాక్టర్‌ మరియ చెన్నమనేని తెలిపారు. వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేశ్‌ సతీమణి అయిన ఆమె జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని ప్రసిద్ధ ఆసుపత్రి క్లినికమ్‌ బుచ్‌లో సీనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌గా 30 ఏళ్లుగా పని చేస్తున్నారు. జర్మనీలో కరోనా నియంత్రణ తీరు.. వైద్యవిధానాలు, ప్రభుత్వ చర్యలపై ‘ఈనాడు’కు ఫోన్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

  • కరోనాతో అతలాకుతలమైన దేశాల్లో జర్మనీ ఒకటి. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి..?

ఈ ఏడాది జనవరి 27న జర్మనీలో మొదటి కేసును గుర్తించారు. స్టార్న్‌బెర్గ్‌లోని జర్మన్‌ కార్ల విడిభాగాల సరఫరాదారు వెబ్‌స్టాకు చెందిన 33 ఏళ్ల ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చింది. వుహాన్‌కి చెందిన ఒక చైనా సహోద్యోగి ద్వారా అతనికి వ్యాపించినట్లు గుర్తించారు. ఇటలీ, ఇరాన్‌, చైనాల నుంచి వచ్చిన వారిద్వారా దేశంలో విస్తరించింది. బుధవారం నాటికి సుమారు 1,32,210 కేసులు 3,495 మరణాలు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత ఉన్నా ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లింది. గుర్తించు, పరీక్షించు, చికిత్సనందించు (ట్రేస్‌, టెస్ట్‌, ట్రీట్‌) విధానం విజయవంతమైంది. పరీక్షల కారణంగా ప్రారంభ రోగ నిర్ధరణ, ఇది రోగి పరిస్థితి క్షీణించక ముందే ప్రారంభ చికిత్సను చేపట్టడం జర్మనీ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి రేటు గణనీయంగా తగ్గింది. 64,300 మంది కోలుకున్నారు. కరోనా మొదట్లో సగటున ఒకరిద్వారా.. 5 నుంచి ఏడుగురి వరకు వ్యాపించింది. ప్రస్తుతం అది 1.2నుంచి 1.5మంది వరకు తగ్గింది. ప్రస్తుతం 2294 మంది ఐసీయూలో ఉండగా 73 శాతం మంది వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్నారు.

  • వైరస్‌ను ఎలా కట్టడి చేశారు

జర్మన్‌ వ్యాధి, అంటువ్యాధుల సంస్థకు చెందిన రాబర్ట్‌ కోచ్‌ ద్వారా కరోనా నివారణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. పెద్దఎత్తున వ్యాధి నియంత్రణ (కంటెయిన్‌మెంట్‌) సమూహాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక చర్యలు తీసుకుంది. మార్చి 22న జాతీయ కర్ఫ్యూ విధించింది. అయిదు ఇరుగు పొరుగు దేశాలకు సరిహద్దులు మూసివేసింది. అత్యవసరాల కోసమే ప్రజలు బయటికి వెళ్లడానికి అనుమతించింది. జర్మనీలో 132 కేంద్రాల్లో వారానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వైరస్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 13.5 లక్షల పరీక్షలు జరిగాయి. వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. టెలీ మెడిసన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

  • జర్మనీ వైద్యవిధానాలు ఎలా ఉన్నాయి

జర్మనీలో కరోనా నియంత్రణకు ప్రభుత్వ వైద్య విధానాలు, వ్యవస్థ ఎంతగానో దోహదపడ్డాయి. దేశం మొత్తం జనాభా 8కోట్లు కాగా. 16రాష్ట్రాలున్నాయి. విద్య, వైద్యరంగాలు పూర్తిగా ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. ఏటా జర్మనీ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి వ్యక్తికి రూ.4.5 లక్షలను ఖర్చు చేస్తోంది. ఇది చాలా దేశాలకంటే ఎక్కువ. ఇక్కడ అందరికీతప్పనిసరి ఆరోగ్య బీమా ఉంది. ప్రతీ1,00,000 మందికి 621 పడకలున్నాయి. వైద్య పరీక్షలు ఉచితం. దాదాపు 28,000 వెంటిలేటర్లు, 40 వేల ఐసీయూ పడకలున్నాయి. కరోనా వ్యాపించినా ఇక్కడ సాధారణ వైద్య సేవలు కొనసాగుతున్నాయి.

  • భారత్‌లో విధానాలపై జర్మన్‌ వైద్యనిపుణులు ఏమంటున్నారు?

జర్మనీ నా పుట్టిల్లయితే.. భారత్‌ మెట్టినిల్లు. నా భర్త, అత్తమామలు చెన్నమనేని రాజేశ్వరరావు లలితాదేవి, బంధువులతో కలిసి తెలంగాణ సంస్కృతిలో నేను భాగస్వామినయ్యా. 130 కోట్ల జనాభా భారత్‌లో వ్యాధి నియంత్రణ, లాక్‌డౌన్‌ అమలు సవాళ్లతో కూడుకున్నది. ఆహారం, ఆరోగ్యభద్రత వంటివి కష్టసాధ్యమైనా లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలుచేస్తున్నారని ఇక్కడి నిపుణులు, ప్రజలు అభినందిస్తున్నారు. ప్రస్తుతం అవలంబిస్తున్న చర్యలకు తోడు పరీక్షలు బాగా పెంచితే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.

ఇదీ చూడండి: సూర్యాపేట జిల్లాలో కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.