ETV Bharat / city

"యువరానర్.. దిసీజ్ వెరీ దారుణం.. ఈ కోడి పుంజును శిక్షించండి".. కోర్టుకెళ్లిన దంపతులు!! - chicken

"యువరానర్..... "మాగ్డా" అనబడే ఈ కోడి పుంజు.. మా ఇంట్లో మమ్మల్ని ప్రశాంతంగా కూర్చోనివ్వట్లేదు.. పడుకోనివట్లేదు.. ఈ కోడి పుంజు ధాటికి కనీసం ఇంట్లో కిటికీలు కూడా తెరవలేకున్నాం.. తలుపు దాటి వరండాలోకి వెళ్లలేకపోతున్నాం.. ఒకటీ రెండు రోజులుగా కాదు.. ఏళ్ల తరబడి ఈ దాష్టీకం కొనసాగుతోంది.. మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్న ఈ కోడి పుంజును కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. దట్సాల్ యూవరానర్!!"

rooster
కోడి పుంజు
author img

By

Published : Sep 10, 2022, 7:51 PM IST

ఇది జర్మనీలో జరిగిన సంగతి.. పశ్చిమ జర్మనీలోని బాడ్ సాల్జుఫ్లెన్‌ ప్రాంతంలో 76 ఏళ్ల ఫ్రెడరిక్ విల్‌హెల్మ్, అతని భార్య జుట్టా తమ సొంత ఇంట్లో నివసిస్తున్నారు. ఈ వయసులో వారికి కావాల్సింది ఏముంటుంది? వేళకు తిండి.. మనసుకు ప్రశాంతత. తిండితిప్పలకు లోటు లేదుగానీ.. మనసుకు మాత్రం బొత్తిగా పీస్ కరువైపోయిందని బాధపడుతున్నారు. ఎందుకు? అని ప్రశ్నిస్తే.. "అంతా దానివల్లే" అంటూ ఓ కోడి పుంజును చూపిస్తారు.

దాని పేరు మాగ్డా. పక్కింటి వాళ్ల గారాల పట్టి..! ఇంతకీ.. అదేం చేసిందని అంటారా? పెద్దగా ఏమీ లేదు.. "కొక్కరో కో.." అని కూస్తుందంతే! ఇదెక్కడి విడ్డూరం..? "కోడి పుంజు కూతపెట్టకుండా ఉంటుందా?" అని అంటారేమో.. అది సాధారణ పుంజు కాదు. ఏ పుంజైనా రోజుకు పది, ఇరవై సార్లు కూస్తుందేమో.. దీని కూత ఏకంగా డబుల్ సెంచరీ దాటిపోతుందట! పొద్దున మొదలు పెడుతుందట కూత.. రెండిళ్ల మధ్యనున్న గోడెక్కి సాయంత్ర సూర్యుడు అలసిపోయే వరకూ.. తగ్గేదే లే అంటూ కూస్తూనే ఉంటుందట!!

పోనీ.. కూత మామూలుగా ఉంటుందా అంటే.. అదీ లేదట. ఏకంగా 80 డెసిబుల్స్ ఉంటుందట. అంటే.. ఓ రోడ్డులో వచ్చే ట్రాఫిక్ శబ్దానికి ఇది సమానమట! పాపం.. అసలే వృద్ధ జంట ఈ గోల తట్టుకోలేకపోయారు. ఆ కోడి ఓనర్ మైఖేల్ తో చాలా సార్లు తమ సమస్య గురించి మాట్లాడారు. కానీ.. ఫలితం లేకపోయింది. "కోడి పుంజు అరిస్తే నేనేం చేసేది..?" అన్నది ఆయన ధోరణి! మైఖేల్ చాలా కోళ్లను పెంచుతున్నాడు. వాటిలో కింగ్ ఇదేనట! "వేరే పుంజైతే కోసి కూరొండించే వాణ్నేకానీ.. మాగ్దా విషయంలో నేనేం చేయలేను ఐయామ్ సారీ" అన్నాడట మైఖేల్.

rooster
కోడి పుంజుపై కేసు

"నీ తొక్కలో కోడి పుంజు కోసం.. మమ్మల్ని చావమంటావా?" వృద్ధులు నిలదీశారు. "నన్నే బెదిరిస్తారా? మీ దిక్కున్నచోట చెప్పుకోపోండి" అన్నాడు మైఖేల్. ఏళ్ల తరబడి వీరి మధ్య సాగిన డిస్కషన్ ఇలా ఉంది. ఇప్పుడు బంతి వృద్ధ జంట కోర్టులోకి వచ్చి పడింది. ఏం చేయాలా? అని చాలా అలోచించారు. కోడి పుంజు అరుస్తోందని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం బాగుంటుంది? అని చాలా మదన పడ్డారు. కానీ.. ఈ తుంటరి కోడి పుంజ లైవ్ రికార్డింగ్ ఆగేదే లే అన్నట్టుగా నడుస్తోంది. ఇక, భరించలేక నేరుగా కోర్టు మెట్లు ఎక్కేశారు.

"ఇంటి పక్కోడు కోడి పుజును వదులుకోడు. మేం దాంతో కలిసి జీవించలేం. ఇక, మీ తీర్పే మాకు శరణ్యం అంటూ కోర్టులో వాదించారు. మా సొంత ఇంట్లో.. మాకు ప్రశాంతత లేకుండా పోయింది. కనీసం కిటికీలు కూడా తెరవలేకపోతున్నాం. ఈ కోడి అరుపులు భరించలేక.. మా పక్కింట్లో ఉండే మరో కుటుంబం రెండేళ్ల కింద ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది. ఈ వయసులో మా సొంత ఇల్లు వదిలి, మేం ఎక్కడికి వెళ్లి పోగలం? మాకు మీరే న్యాయం చేయండి" అని న్యాయమూర్తిని అర్థించారు. సాక్ష్యంగా.. ఆ కోడి పుంజు అరుపులను రికార్డు చేసిన వీడియో చూపించారు. ఈ కేసును లెమ్‌గో జిల్లా కోర్టు న్యాయమూర్తి త్వరలో విచారించనున్నారు. మరి, న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.