ETV Bharat / city

GEETHA ARTS : వరద బాధితులకు.. "గీతా ఆర్ట్స్" విరాళం - geetha arts giving donation for flood affected

తిరుపతి వరద బాధితుల సహాయార్థం సినీ నిర్మాణ సంస్థ "గీతా ఆర్ట్స్‌".. రూ.10లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు సీఎం సహాయనిధికి ఆ మొత్తాన్ని అందించింది.

గీతా ఆర్ట్స్ విరాళం
గీతా ఆర్ట్స్ విరాళం
author img

By

Published : Nov 24, 2021, 10:09 PM IST

Updated : Nov 24, 2021, 10:37 PM IST

వరద ముంపు నుంచి తిరుపతి ఇంకా తేరుకోలేదు. తినడానికి తిండి కూడా సరిగా దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి వరద బాధితుల సహాయార్థం చిత్ర నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్‌ రూ.10లక్షలు విరాళం ప్రకటించింది. ఈ మేరకు సీఎం సహాయనిధికి రూ.10 లక్షలు అందించింది.

కాగా.. తిరుపతిలో చాలా కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదపోటుకు చెరువులు తెగి నివాస ప్రాంతాలలోకి వరద పోటెత్తుతూనే ఉంది. ప్రధానంగా పద్మావతి మహిళ యూనివర్శిటీ, లింగేశ్వర నగర్‌, కేశవాయినగుంట, ఆటోనగర్‌, యశోదనగర్‌, సరస్వతీనగర్‌, ఉల్లిపట్టెడ, శ్రీకృష్ణనగర్‌ ముంపులోనే ఉన్నాయి. గాయిత్రీనగర్​లోని 2 వేల కుటుంబాలు ఇళ్ల నుంచి బయటకురాలేని పరిస్థితి నెలకొంది.

ఇదీచదవండి.

Road Blocked : ధ్వంసమైన రోడ్లపై.. ముళ్ల కంచెలు వేసి

Last Updated : Nov 24, 2021, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.