ETV Bharat / city

GAS LEAK: కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్​.. 28మందికి అస్వస్థత..! - AMARAVATI NEWS

మహారాష్ట్ర అంబర్‌నాథ్ నగరంలోని ఓ కెమికల్​ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. దీంతో 28కి పైగా కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ఎక్కువగా మహిళా కార్మికులే ఉన్నట్లు సమాచారం.

GAS LEAK
GAS LEAK
author img

By

Published : Oct 12, 2021, 8:41 PM IST

Updated : Oct 12, 2021, 9:57 PM IST

మహారాష్ట్ర అంబర్‌నాథ్‌లోని ఓ కెమికల్ ప్లాంట్ నుంచి సల్ఫ్యూరిక్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 28కి పైగా కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. వీరంతా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై శివాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, శివాజీనగర్ పోలీసులు, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు లీకేజీ సమస్యను పరిష్కరించారు. "మేము ఘటనా స్థలానికి చేరుకున్న గంటలోనే పరిస్థితి అదుపులోకి తెచ్చాము. బాధితులని సెంట్రల్ హాస్పిటల్‌లో చేర్చాము. ప్రాణాపాయం తప్పిది'' అని ఆర్​డీఎంసీ చీఫ్ సంతోశ్​ తెలిపారు.

అంబర్‌నాథ్‌ కంపెనీలో సల్ఫ్యూరిక్ యాసిడ్‌ స్వేదన ప్రక్రియ జరుగుతోంది. ఈరోజు ఉదయం ప్లాంట్ నుంచి అకస్మాత్తుగా గ్యాస్ లీకేజీ కావడంతో కార్మికులకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఫలితంగా.. కంపెనీలోని కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ లీకేజీకి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని అంబర్‌నాథ్ అదనపు తయారీదారుల సంఘం అధ్యక్షుడు ఉమేష్ తాయ్డే ఆరోపించారు.

ఇదీ చూడండి:

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 503 కరోనా కేసులు.. 12 మరణాలు

Last Updated : Oct 12, 2021, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.