ETV Bharat / city

బాలికపై సామూహిక అత్యాచారం.. పోలీసుల అదుపులో వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారులు!

Gang Rape on Girl: హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో పదిహేడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి వద్ద డ్రాప్​ చేస్తామని తీసుకెళ్లి కారులో అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు.

Gang Rape on Girl
హైదరాబాద్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్
author img

By

Published : Jun 3, 2022, 2:47 PM IST

Updated : Jun 3, 2022, 8:05 PM IST

Gang Rape on Girl: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కొందరు కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... గత నెల 28న ఓ బాలిక (17) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. దాదాపు 150 మంది 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే మద్యం రహిత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ముగిసే సమయానికి పావుగంట ముందు పబ్‌ నుంచి బాలిక బయటకు వచ్చింది.

అక్కడే ఉన్న రెండు కార్లలో యువతితో పాటు మరో 8మంది యువకులు బయల్దేరారు. ఇందులో బెంజికారుతో పాటు ఇన్నోవా కారు కూడా ఉంది. బెంజికారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు, మరో ప్రజాప్రతినిధి కుమారుడు, వారి స్నేహితులు ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని బేకరి వద్దకు వెళ్లి 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. అనంతరం బాలిక.. ప్రజాప్రతినిధి కుమారుడు, అతని స్నేహితులు నలుగురితో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరింది. నిర్జన ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం 7.30గంటలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు.

పోలీసుల అదుపులో బెంజి కారు
పోలీసుల అదుపులో బెంజి కారు

ఆ తర్వాత బాలిక ఫోన్‌ చేయడంతో తండ్రి వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అయితే, బాలిక మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. ఐదుగురు కారులో తనపై దాడికి పాల్పడ్డారని చెప్పడంతో ఆమె తండ్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇన్నోవా కారులో 16, 17 ఏళ్ల బాలురు ఉన్నారని, వారిలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు కూడా ఉన్నట్టు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలింపు చేపట్టారు. ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయంపై సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బెంజి కారును పోలీసులు సీజ్‌ చేశారు. అయితే ఈ కేసులో వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్ కుమారుడు, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

Last Updated : Jun 3, 2022, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.