గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరులోని మహాత్ముని విగ్రహానికి మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ స్వరాజ్యం సాధించేందుకే ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిందని మంత్రి అనిల్ అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భాజపా ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన రహదారిలోని మహాత్ముడి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ మహాత్మునికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రధాన రహదారి కూడలిలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని వీరశైవ సంఘము కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఎంపికైన రుద్రగౌడ్ ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా మైలవరం మార్కెట్ సెంటర్‌లోని బాపూజీ విగ్రహానికి పలు సేవా సంస్ధలు, రాజకీయ నేతలు నివాళులర్పించారు.
ఇదీ చదవండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం