తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందటం కలకలం రేపింది. ఆజీరాం బీ(63), ఆమె కుమార్తె ఆస్మా బేగం(35), అల్లుడు ఖాజా పాషా (42), మనుమరాలు హసీనా(10) మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట్ల పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. వంట గదిలో అజీరాం బీ, డైనింగ్ హాలులో ఆస్మా బేగం, ఇంటి వెనుక గుంత వద్ద అల్లుడు, హాలులో హసీనా మృతదేహాలు పడి ఉన్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: భార్య మరణ వార్త విని భర్త మృతి