మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్.. బుధవారం కంచిలోని కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామిని కలసి.. తెలుగు భాషా వికాసంపై చర్చించారు. ఈ సందర్భంగా దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారికి మాతృభాషను నేర్పించేందుకు అంతర్జాతీయ సంస్థ అవసరమని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి సూచించారు.
తమిళనాడులో కోటి మందికి పైగా తెలుగు వారికి తెలుగు భాష నేర్పే కార్యక్రమం చేపట్టినట్టు స్వామీజీ తెలిపారు. తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి.. మండలి బుద్ధప్రసాద్ చేస్తున్న సేవను గమనిస్తున్నామన్న స్వామి.. ఆయనకు ఆశీస్సులు అందించారు.
ఇదీ చదవండీ.. projects: రాయలసీమ ప్రాంత దాహార్తిని తీర్చేందుకే ఎత్తిపోతల