ETV Bharat / city

రథం దగ్ధం వెనుక పెద్ద కుట్ర ఉంది: ఐవైఆర్​ కృష్ణారావు - iyr Krishna Rao react on Antarvedi temple chariots fire mishap

అంతర్వేది ఆలయ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్​ కృష్ణారావు అన్నారు. రథం దగ్ధం వెనుక పెద్ద కట్ర ఉందని ఆరోపించారు. ఓ పథకం ప్రకారం హిందూ దేవాలయాలు, దేవుళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆక్షేపించారు.

Antarvedi temple chariot's fire mishap
Antarvedi temple chariot's fire mishap
author img

By

Published : Sep 9, 2020, 4:37 PM IST

రథం దగ్ధం వెనుక పెద్ద కుట్ర ఉంది: ఐవైఆర్​ కృష్ణారావు

అంతర్వేదిలో రథం దహన ఘటన చిన్న విషయం కాదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్​ కృష్ణారావు అన్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కూడా కాదని వ్యాఖ్యానించారు. రథం దగ్ధం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఓ పథకం ప్రకారం హిందూ దేవాలయాలు, దేవుళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆక్షేపించారు. ఈ తరహా ఘటనలను వెనకుండి ప్రోత్సహిస్తున్న శక్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం వల్లే వరుస ఘటనలు జరుగుతున్నాయని ఐవైఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఓ మత ప్రచార వ్యాప్తిలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

వివాదం నడుమ ముంబయి చేరుకున్న కంగన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.