ETV Bharat / city

'అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పపై డీఐజీకి ఫిర్యాదు చేస్తా' - ఎస్సీ ఎస్టీ కేసు

అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పపై డీఐజీకి ఫిర్యాదు చేస్తానని.. ఉద్యోగం నుంచి తొలగించిన ఏఆర్​ కానిస్టేబుల్ ప్రకాశ్ తెలిపారు. అలాగే కోర్టుకు కూడా వెళతానన్నారు. ఎస్పీ ఫక్కీరప్పతోపాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు విచారణకు ప్రకాశ్ హాజరయ్యారు. ఎస్పీ ఫక్కీరప్పతో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కేసు విచారిస్తున్న పలమనేరు డీఎస్పీ గంగయ్యను అభ్యర్థించారు.

Prakash
ప్రకాశ్​
author img

By

Published : Sep 7, 2022, 9:40 AM IST

ఉద్యోగం నుంచి తొలగించబడిన ఏఆర్​ కానిస్టేబుల్​ ప్రకాశ్​ ఎస్సీ, ఎస్టీ కేసు విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప అవినీతిపై డీఐజీని కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎస్పీ ఫక్కీరప్పతో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కేసు విచారిస్తున్న పలమనేరు డీఎస్పీ గంగయ్యను ప్రకాశ్ అభ్యర్థించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో ఫక్కీరప్పపై ఎఫ్​ఐ ఆర్ నమోదు చేసినా ఇప్పటి వరకు నోటీసులు ఎందుకు ఇవ్వటంలేదని ఆయన డీఎస్పీ గంగయ్యను ప్రశ్నించారు. దీనికి సంబంధించి సమాచారహక్కు చట్టం కింద సమాచారం కోరుతూ దరఖాస్తు ఇవ్వగా గంగయ్య తిరస్కరించినట్లు ప్రకాశ్ ఆరోపించారు. ఎస్పీ ఫక్కీరప్ప అవినీతిపై తాను మీడియాకు చెప్పిన విషయాలన్నీ ఫిర్యాదు చేయటానికి రేపు డీఐజీ రవిప్రకాశ్​ను కలుస్తానన్నారు. విచారణ అధికారి డీఎస్పీ గంగయ్యకు పూర్తిస్థాయిలో సహకరించి అన్ని విషయాలు చెబుతానని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.