స్థానిక సంస్థల ఎన్నికల పోరులో ఎంపీటీసీ, జడ్పీటీసీల నామినేషన్ల ఘట్టం ముగిసింది. పలు పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా నామపత్రాలు దాఖలు చేశారు. ఇక ప్రచారమే తరువాయి. అయితే అభ్యర్థులు గెలుపొందాలంటే ఓటర్లతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓటర్ల మెప్పు పొందలేకపోతే నోటాతో సమాధానం చెప్పే ప్రమాదముంది. ఈసారి ఎన్నికల్లో నోటాకు చోటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు నమూనా బ్యాలెట్ పత్రాల్లో చివరన నోటా గుర్తును ముద్రిస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయాల్లో నమూనా బ్యాలెట్ పత్రాలను అతికించారు. అభ్యర్థుల నడవడిక నచ్చకపోతే ఓటరు నోటాకు పని చెబుతారు. నోటాను ప్రవేశపెట్టటంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని భావిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో వందల సంఖ్యలో నోటాకు ఓట్లు పడితే... 2019 ఎన్నికల్లో ఈ సంఖ్య వేలకు చేరుకోవటం గమనార్హం.
ఇదీ చదవండి: