ETV Bharat / city

Flash Floods: భారీవర్షంతో నీటమునిగిన హైదరాబాద్ కాలనీలు.. ఇళ్లలోకి చేరిన నీరు..

హైదరాబాద్​లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షం కురవడంతో... చెరువుల్లోని నీరు ఇళ్లలోకి చేరింది. భారీ వర్షానికి హయత్​నగర్​ లోతట్టు కాలనీలు నీట మునిగాయి. ఎల్బీనగర్​ నియోజకవర్గంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రతి సంవత్సరం ఇలాగే కాలనీలు ముంపునకు గురవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

floods
floods
author img

By

Published : Jul 15, 2021, 10:39 AM IST

భారీవర్షంతో నీటమునిగిన హైదరాబాద్ కాలనీలు.. ఇళ్లలోకి చేరిన నీరు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం నుంచి పలుప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితల ఆవర్తనం కారణంగా... తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో 3.1 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో గురువారం సైతం భారీ వర్షాలు కురిసే అవకాశమున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది.

చినుకు పడితే చాలు నీరు ఇంట్లోకి వచ్చేస్తుంది. మూడురోజుల నుంచి ఇదే పరిస్థితి. రోడ్డు దాటాలన్నా.. ఏదైన పనిమీద బయటకు పోవాలన్నా.. చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ ఏ గుంట ఉంటుందో తెలియక.. నీటిలో పడిపోతున్నాము. మేము వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్నా... వర్షమొస్తే ఈ ఏరియా పరిస్థితి ఇలానే ఉంటుంది. అధికారులు దీనిని మంచిగా చేస్తారేమో అనుకున్న ప్రతిసారి మాకు నిరాశే మిగులుతుంది.

- స్థానికులు

బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురిసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ శివారులోని హయత్‌నగర్​లోని రెండు ఆర్డీసీ బస్‌ డిపోల సమీపంలోని కోర్టు, అగ్నిమాపక కేంద్రంలోకి భారీగా వరద వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతం కావడంతో హయత్‌నగర్‌ ఆర్టీసీ డిపో... చెరువును తలపిస్తోంది. దీనితో డిపోల నుంచి బస్సులు బయటకి తీయడానికి డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. డిపోలోని డీజిల్ బంక్ సగానికి పైగా మునిగిపోయింది. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి వెళ్లడంతో... స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రతి సంవత్సరం ఏదో పని చేస్తున్నారు కానీ.. ఫలితం అయితే లేదు. అధికారులు వస్తున్నారు.. చూస్తున్నారు. మూడు రోజుల క్రితం ఎల్బీనగర్​ ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి కూడా ఇక్కడకు వచ్చారు. తరువాత అధికారులు ఏవో పనులు ప్రారంభించారు కానీ... ఈ ఉద్ధృతికి అవి సరిపోవు. గత సంవత్సరం ఇంతకంటే ఎక్కువ వచ్చింది. అప్పుడు చెరువు కట్ట తెగింది కాబట్టి ఎక్కువ వరద వచ్చింది. కానీ ఇప్పుడు వర్షానికే ఇంత వరద వచ్చిందంటే.. తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకోవడానికి భయం వేస్తుంది.

-స్థానికులు

నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. గాయత్రీ నగర్ పేజ్-1, పేజ్-2 పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. వనస్థలిపురంలోని ప్రశాంత్ నగర్​లో రోడ్డుకి అడ్డంగా భారీ వృక్షం పడిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు మరింత ఇబ్బందిని కలిగిస్తున్నాయి. హయత్ నగర్​లోని పద్మావతి నగర్ కాలనీ, బంజారా కాలనీ, ఎల్బీనగర్​లోని రెడ్డి కాలనీ, నాగోల్​లోని అయ్యప్ప కాలనీలలో భారీగా వరద నీరు చేరింది. అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని బాటసింగారం గ్రామం నుంచి మజీద్ పూర్ గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టు వద్ద వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్బీనగర్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల పరిధిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.

ఇదీ చూడండి: polavaram: ఎటు చూసినా మొండి స్తంభాలు.. నిర్వాసితుల ఇక్కట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.