ETV Bharat / city

తెలంగాణ: జన్మదిన వేడుకల్లో కత్తి​తో వీరంగం... ఐదుగురిపై కేసులు

స్నేహితుడి జన్మదిన వేడుకల్లో తల్వార్​తో వీరంగం సృష్టించిన ఐదుగురు యువకులను హైదరాబాద్ లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో తల్వార్​ను తిప్పుతూ డ్యాన్స్ చేసినందుకు ఐదుగురిపై భారతీయ ఆయుధ చట్టంతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు.

five-men-arrested-in-hyderabad-over-play-with-knives-at-open-place
జన్మదిన వేడుకల్లో తల్వార్​తో వీరంగం... ఐదుగురిపై కేసులు
author img

By

Published : Jun 28, 2020, 9:37 PM IST

జన్మదిన వేడుకల్లో తల్వార్​ను తిప్పి వీరంగం సృష్టించిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తెలంగాణలోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హైదరాబాద్​ లాలాపేట్ ప్రాంతానికి చెందిన దిలీప్ ముదిరాజ్ (28) తన జన్మదిన వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో లాలాపేట్ లక్ష్మీనగర్ రోడ్డుపై స్నేహితులతో కలిసి చేసుకున్నాడు. ఈ క్రమంలో తాగిన అతని స్నేహితులు ఉత్సాహంతో కత్తితో నడిరోడ్డుపై హల్​చల్​ చేశారు.

ఆ దృశ్యాలను వాట్సాస్​ స్టేటస్​లుగా పెట్టుకోవడం సహా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. అది కాస్త వైరల్​ కావడం వల్ల పోలీసులు రంగంలోకి దిగారు. జన్మదిన వేడుకలు చేసుకున్న దిలీప్​తో పాటు ఆ వేడుకల్లో తల్వార్​తో ఆడిన మరో నలుగురు స్నేహితులపై కేసు నమోదు చేశారు. దయాకర్ యాదవ్, చంద్రశేఖర్, ఆకాష్ వర్మ, అబ్బగాడి ఆకాష్​లను అదుపులోకి తీసుకున్నారు. డిజాస్టర్ మేనేజ్​మెంట్ యాక్ట్​తోపాటు తల్వార్‌ను తిప్పి డ్యాన్స్ చేసినందుకు భారతీయ ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి..

ఆర్టీసీ ఆధునికీకరణ బాట..30న వెబ్​సైట్​ సేవలు బంద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.