గుజరాత్లో చిక్కుకున్న ఏపీ జాలర్లను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరావల్ జెట్టి తీరంలో చిక్కుకున్న జాలర్లను ప్రైవేట్ బస్సుల్లో ఏపీకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని… గుజరాత్ భాజపా నేతలు తెలిపారు. గుజరాత్‌లో చిక్కుకున్న 5 వేలమందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి స్థానికంగానే వైద్యం అందిస్తామని చెప్పారు. నెగెటివ్ వచ్చిన వారిని బస్సుల్లో పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అక్కడి అధికారులు తెలిపారు. వీరావల్ మత్స్యకారులు ఈ సాయంత్రం బయల్దేరే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభించిన సీఎం