భద్రాద్రి కొత్తగూడెంలో రహదారిపై ఓ కారులో మంటలు చెలరేగాయి. వాహనంలో పొగలు రావడం గమనించిన డ్రైవర్.. వెంటనే దిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వచ్చినట్లు డ్రైవర్ తెలిపాడు. మంటలు ఎక్కువగా రావడంతో కారు పూర్తిగా కాలిపోయింది. నడివీధిలో కారు దహనం కాగా ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు.
ఇదీ చదవండీ...ఆడపిల్ల పుట్టిందని ఇంట్లో గొడవ.. ఇంతలో పాప అనుమానాస్పద మృతి..