ETV Bharat / city

Fire Accident in Keesara: కీసరలోని రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

author img

By

Published : Feb 14, 2022, 3:04 PM IST

తెలంగాణలోని ఓ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న పలు పరిశ్రమలకు మంటలు అంటుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలార్పారు.

fire accident
కీసరలోని రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
కీసరలోని రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

Fire Accident in Keesara : మేడ్చల్ జిల్లా కీసర మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాంపల్లి వద్ద ఓ రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. మొదట ఓ కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న మరో పరిశ్రమకు వ్యాపించాయి. ఈ మంటల్లో పరిశ్రమలోని పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. వెంటనే పరిశ్రమ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Fire Accident in Keesara Chemical factory : హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో సిబ్బంది త్వరగా అప్రమత్తమవ్వడం వల్ల ప్రాణనష్టం తప్పిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. రూ.10 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు పరిశ్రమ యజమాని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.