పులిచింతల జలాశయంలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీల నీటిని అధికారులు నిల్వ ఉంచారు. జలాశయం వద్ద 175 అడుగుల నీటి మట్టం నమోదు అయింది. ఎగువ నుంచి 37 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా... దిగువకు 44 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. రెండు రేడియల్ గేట్లను 0.9, 1.5 మీటర్ల మేర ఎత్తి 29 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుత్ జనరేషన్ ప్లాంట్ కోసం 15 వేల క్యూసెక్కులు, లీకుల ద్వారా 1000 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నాయి.
ప్రభుత్వ విప్ సందర్శన
తొలిసారి పూర్తి సామర్థ్యం మేర నీటి నిల్వతో కళకళ లాడుతున్న పులిచింతల జలాశయాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సందర్శించారు. నాటి వైఎస్ఆర్ కల నేడు జగన్ హయాంలో పూర్తైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంకల్పానికి ఇది ప్రకృతి ఆశీస్సులు అని అభివర్ణించారు. డ్యాంవద్ద కృష్ణా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి