ACTOR PRUDHVI ON MP GORANTLA VIRAL VIDEO: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై సినీ నటుడు పృథ్వీరాజ్ స్పందించారు. అంగబలం, అర్ధబలం ఉండటంతోనే గోరంట్ల మాధవ్‌ను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. ‘‘ఈనెల 4న బయటపడిన ఆ దరిద్రపు వీడియోకి సంబంధించి ఎంపీ మాధవ్ వాడిన భాష ఆ పార్టీ నేతలకు బాగా నచ్చినట్టుంది. ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం. పార్లమెంట్‌లో తెలుగు ఎంపీలకు ఒక మంచి చరిత్ర ఉంది. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంతో అంతా తుడిచిపెట్టుకు పోయింది. పృథ్వీ వ్యవహారంలో వారంపాటు ఖాళీలేకుండా ప్రెస్‌మీట్‌లు పెట్టిన ఆ పార్టీ నేతలు ఇప్పుడేమయ్యారు. అనంతపురం ఎస్పీ చెబుతున్న విషయాలు ఒకదానికొకటి పొంతన లేవు. చివరకు ఫేక్ అని తేల్చేశారు. కానీ, ప్రజలు ఆ మాత్రం అవగతం చేసుకోకుండా ఉండరు’’ అని పృథ్వీ అన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించినదిగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో ఒరిజనల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ కె. ఫకీరప్ప నిన్న మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. ఎడిటింగ్ లేదా మార్ఫింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఒరిజినల్ ఉంటేనే ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించి, మార్ఫింగా.. కాదా? అనేది తేల్చగలమని అన్నారు. దీంతో ఎంపీ గోరంట్లను ఎస్పీ వెనకేసుకొస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఇవీ చదవండి: