రాజధాని అంశంపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే మాజీ అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి ఫీజు చెల్లింపు నిమిత్తం 5 కోట్ల రూపాయల కేటాయింపునకు సంబంధించి జారీచేసిన జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సుధాకర్‌బాబు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రణాళికా శాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇంత భారీ మెుత్తంలో రుసుము చెల్లించేందుకు న్యాయవాదులు చట్టం అనమతిస్తుందో లేదో పరిశీలించాలని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని జీవోను రద్దు చేయాలని వ్యాజ్యంలో కోరారు.
ఇదీ చదవండి: రాజధాని కేసుల వాదనకు ముకుల్ రోహత్గీ.. ఫీజు 5 కోట్లు