ETV Bharat / city

ఎలక్షన్‌ కమిషన్‌లో పిటిషన్‌ వేసుకోండి: హైకోర్టు

author img

By

Published : Apr 30, 2021, 5:20 PM IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై దాఖలైన 2 పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. కమిషన్‌లో పిటిషన్‌ వేసుకోవాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పింది.

హైకోర్టు
హైకోర్టు

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి, భాజపా అభ్యర్థి రత్నప్రభ వేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఎలక్షన్‌ కమిషన్‌లో పిటిషన్‌ వేసుకోవాలని సూచించింది. అక్రమాలు జరిగాయని ఆధారాలు పొందుపరిచారని... ఈ సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ... పనబాక లక్ష్మి హైకోర్టులో వాజ్యం దాఖలు చేశారు. తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికను రద్దు చేయాలని భాజపా అభ్యర్థి రత్నప్రభ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పింది.

ఇదీ చదవండీ... పరీక్షల అంశంపై హైకోర్టులో విచారణ.. మే 3కు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.