ETV Bharat / city

Fever Survey: నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే - కొవిడ్ మహమ్మారి

Fever Survey: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి మరోమారు ఫీవర్ సర్వే ప్రారంభం కానుంది. కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి మందులు అందించనున్నారు. ఇందుకోసం కోటి హోమ్ ఐసోలేషన్ కిట్‌లను సర్కారు సిద్ధం చేస్తోంది.

Fever Survey
Fever Survey
author img

By

Published : Jan 21, 2022, 1:02 PM IST

నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే

Fever Survey: కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆసుపత్రులు, పడకలు, మందులు సిద్ధం చేసిన సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఫీవర్ సర్వే చేపట్టనుంది. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి జ్వరం లక్షణాలు ఉన్న వారిని గుర్తించి అవసరమైన వారికి మందులను అందించనున్నారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆశాలు, ఏఎన్ఎంలు ఫీవర్‌ సర్వేలో కీలక పాత్ర పోషించనున్నారు. 25 వేల మందికి పైగా ఏఎన్ఎంలు, 7 వేలకు పైగా ఉన్న ఆశా వర్కర్లు ప్రతి గడపను తట్టి మందులు అందించనున్నారు. సర్వేలో మున్సిపల్, పంచాయతీ రాజ్ సిబ్బంది సైతం సహకరించాలని హరీశ్‌రావు కోరారు.

isolation kits: కొవిడ్‌ రెండో వేవ్ సమయంలోను సర్కారు రెండు సార్లు ఫీవర్ సర్వే చేపట్టింది. గతేడాది ఏప్రిల్‌లో తొలిసారి సర్వే చేపట్టిన ప్రభుత్వం 2 లక్షల 41 వేల మందికి జ్వర లక్షణాలు ఉన్నట్టు గుర్తించి వారికి హోమ్ ఐసోలేషన్ కిట్లను అందజేసింది. మేలో చేపట్టిన రెండో సర్వేలో లక్షా 50వేల మందికి మందులు అందించారు. ఈసారి ఏకంగా కోటి కిట్‌లను సర్కారు సిద్ధం చేస్తోంది. ఈ కిట్ లో అజిత్రోమైసిన్‌తో పాటు పారాసిటమాల్‌, లెవో సెట్రిజన్‌ , రానిటిడైన్ , విటమిన్ సి, మల్టీ విటమిన్, విటమిన్ డి మందులు ఉంటాయి. నాలుగైదు రోజుల్లో ఫీవర్‌ సర్వే పూర్తయ్యేలా పనిచేయాలని మంత్రి హరీశ్‌రావు ఆధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి:

AP CORONA CASES: రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. 12,615 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.