Amaravati farmers: అమరావతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే రెండో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు అమరావతి ఐకాస నేతలు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని అనంతవరం వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి వెంకటపాలెం తితిదే ఆలయం వరకు రైతులు, మహిళలు పాదయాత్ర చేపట్టారు. మూడు రాజధానులపై రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు పెట్టించడంపై ఐకాస నేతలు మండిపడ్డారు. రాజధాని అమరావతి ప్రజలందరిదనే విషయాన్ని పాదయాత్రలో మరోసారి వివరిస్తామని తెలిపారు.
ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, న్యాయస్థానాలపైన ఏ మాత్రం గౌరవం లేదని అమరావతి రైతులన్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాటం చేస్తామన్నారు. రాజధాని యావత్ ఆంధ్రప్రదేశ్‌ది అని అన్నారు. హైకోర్టు అమరావతిని అభివృద్ధి చేయాలని స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. ఈ ప్రభుత్వంలో చలనం లేకపోగా మూడు రాజధానుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అమరావతి అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధని.. ఈ విషయాన్ని రాష్ట్రమంతటా తెలియజేసేందుకే రెండో విడత పాదయాత్ర చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
- నాగార్జున వర్సిటీ నుంచి సీజేఐకి గౌరవ డాక్టరేట్, ప్రదానం చేసిన గవర్నర్
- ఈడీ కాకపోతే బోడీ తెచ్చుకో, ఎవరికీ భయపడేది లేదన్న సీఎం కేసీఆర్
- యూట్యూబ్‌లో చూసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మైనర్లు