జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజధాని అమరావతిలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కృష్ణాయపాలెంలో శిబిరం వద్ద రైతులు పండించిన ఉల్లి, కంద, వరి కంకులు కట్టి నిరసన తెలియజేశారు. కిసాన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చిగురుపాటి రవీంద్రబాబు రైతు జెండాను ఆవిష్కరించి అన్నదాతలకు సంఘీభావం ప్రకటించారు. వెలగపూడిలో రైతులు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరావతికి మద్దతుగా నినాదాలు చేసి....రోడ్డుపై నిరసన తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ రైతు దినోత్సవం నిర్వహించకుండా రైతులను రోడ్లపై నిలబెట్టారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినా..... రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని అన్నదాతలు ప్రశ్నించారు. ఏడాది కాలంగా తమను రోడ్డుపై నిలబెట్టిన ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెబుతామని రైతులు మహిళలు చెప్పారు.
తహసీల్దార్ వినూత్న ఆలోచన... ప్రమాణ పత్రంతో లంచాలకు అడ్డుకట్ట