అమరావతి పరిధిలోని దొండపాడు గ్రామానికి చెందిన రైతు... కొమ్మినేని మల్లికార్జునరావు గుండెపోటుతో చనిపోయారు. 17 రోజులుగా రైతుల నిరసన దీక్షలో పాల్గొంటున్న మల్లికార్జునరావు.. గత రాత్రి రాజధాని తరలిపోతే భవిష్యత్ ఏంటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సన్నిహితులు చెప్పారు. ఈ బెంగతోనే గుండెపోటుకు గురై చనిపోయినట్లు తెలిపారు. గుండెపోటుతో మృతిచెందిన రైతు కొమ్మినేనిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని గ్రామస్తులు, ఐకాస నేతలు ఆరోపించారు. ఆయన మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..