ETV Bharat / city

Family Suicide: అప్పుల బాధ తాళలేక.. విజయవాడలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్య - family suicide by debts

తెలంగాణలోని నిజామాబాద్​కు చెందిన పప్పుల సురేశ్​ కుటుంబం అప్పుల బాధ భరించలేక విజయవాడలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. వారికి ఒకటి, రెండు కాదు ఏకంగా రూ. నాలుగన్నర కోట్ల అప్పులు ఉన్నట్లుగా సమాచారం. నిజామాబాద్​లోని ఓ అపార్ట్​మెంట్​లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్న పప్పుల సురేశ్..​ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడటం అపార్ట్​మెంట్​ వాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వారంతా తమతో కలివిడిగానే ఉండేవారని.. కానీ వాళ్లకు ఇన్ని అప్పులున్నాయని తెలియదని చెబుతున్నారు.

అప్పుల బాధ తాళలేక విజయవాడలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్య

author img

By

Published : Jan 8, 2022, 7:15 PM IST

అప్పుల బాధ తాళలేక విజయవాడలో తెలంగాణ కుటుంబం ఆత్మహత్య

ఎనిమిదేళ్లుగా పప్పుల సురేశ్​ కుటుంబం ఇదే అపార్ట్​మెంట్​లో ఉంటోంది. వారిని చూస్తే ఉన్నత స్థితిలో ఉన్నట్లుగానే అనిపిస్తారు. స్థానికంగా బస్టాండ్​ ఎదురుగా సురేశ్​కు మెడికల్​ షాప్​ ఉంది. ఇటీవల రోడ్డు వెడల్పులో ఆ షాప్​ కూలగొట్టారు. దానికి సంబంధించి అప్పులు ఉండొచ్చు. రెండు రోజుల క్రితం ఓ సంస్థ వాళ్లు ఈ ఇంటిని సీజ్​ చేశారు. ఇటీవల చాలా మంది బాకీల వసూళ్ల కోసం ఇంటికి వచ్చారు. అప్పుడే వాళ్లకు ఇన్ని అప్పులున్నాయని మాకు తెలిసింది. బయటకు వెళ్లి వెంటనే వస్తారనుకున్నాం కానీ.. ఇలా సూసైడ్​ చేసుకుంటారని అనుకోలేదు. -- స్థానికులు, నిజామాబాద్​

ఇదీ చదవండి:

PRC: పీఆర్సీ విషయంలో ఉద్యోగులను సీఎం జగన్ మోసం చేశారు: ప్రతిపక్ష నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.