ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. ఒక్కో సంస్థనూ నిపుణుల కమిటీ విభజిస్తోంది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో తెలుగురాష్ట్రాల మధ్య పంపకాల కోసం పలు సూచనలు చేసింది. ఆస్తులు, అప్పులతో పాటు ఉద్యోగులనూ వేరు చేసింది. చట్టంలోని సెక్షన్ 82 ప్రకారం.. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఏపీకి ఆస్తి పంపకం చేయాలని తెలంగాణకు సిఫార్సు చేసింది. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు.. రూ. 33.46 లక్షల ఆస్తి పంచి ఇవ్వాలని సూచించింది.
జనాభా నిష్పత్తి ప్రకారం ఉద్యోగుల పంపకాలు పూర్తి చేయగా.. ఏపీకి 285, తెలంగాణకు 199 పోస్టులు మంజూరు చేసినట్లు నిర్ధారించింది. ప్రస్తుత ఉద్యోగుల్లో ఏపీకి 93, తెలంగాణకు 76 మంది చొప్పున కేటాయించింది. కార్పొరేషన్‌కు చెందిన 528 చదరపు మీటర్ల స్థలంలోని 22,801 చదరపు అడుగుల కార్యాలయ భవనం.. అవిభాజిత ఆస్తిగా ఉందని తెలిపింది. దానినీ జనాభా నిష్పత్తి ప్రాతిపదికన విభజించుకోవాలని సూచించింది.
ఇదీ చదవండి: