ETV Bharat / city

అంతర్వేది ఘటనపై కుల, మత రాజకీయాలు: హర్షకుమార్ - అంతర్వేది ఆలయ ఘటన వార్తలు

అంతర్వేది ఘటనపై కుల, మత రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నాయకులు కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

ex mp harsha kumar
ex mp harsha kumar
author img

By

Published : Sep 11, 2020, 6:23 PM IST

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దేవస్థానం రథం దగ్ధమైన ఘటనలో కుల, మత రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్‌ విమర్శించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలో అంతర్వేది ఉందని తెలిపారు. ఆయన జనసేన అధినేత పవన్​ను ఎదిరించటం వల్లే అక్కడ ఇలాంటి ఘటనలు జరిగాయని ఆరోపించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నాయకులు కుల రాజకీయాలు చేస్తున్నారని హర్ష కుమార్ విమర్శించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సీబీఐ విచారణకు ఆదేశించారని.. అదే సీతానగరం మండలంలో దళిత యువకుడు శిరోముండనం వ్యవహారంపై మాత్రం నిందితులను ఇప్పటికీ అరెస్టు చేయలేదని అన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ది ఉంటే తక్షణం శిరోముండనం ఘటనలపైనా సీబీఐ విచారణకు ఆదేశించాలని హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి

అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.