జగన్ ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఉన్నత న్యాయస్థానంలోని న్యాయాధిపతుల ఫోన్ లు ట్యాప్ చేసే ప్రయత్నం జరిగిందనే వార్తలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడటం వల్లే సీఎం జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారన్న ఆయన.... ఆ భయంతోనే ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ విధ్వంస పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: