అయోధ్యకు పరిష్కారం చూపినట్లే ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించేందుకు తగిన మార్గాన్ని సూచించాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలకు పుల్లారావు సంఘీభావం తెలిపారు.
తుళ్లూరు, వెలగపూడి, మందడంలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు. ఐదు కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా కేంద్రం కాలయాపన చేయడం తగదన్నారు. అనాలోచితం, అవగాహన లేకపోవడం వల్ల రాష్ట్రాభివృద్ధి ఆగిపోయిందన్నారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. న్యాయస్థానాల తీర్పులు రాకముందే కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలన్నారు.
ఇదీ చదవండి
ఒక్క ఎమ్మెల్యే గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా: అవంతి