మూడు రాజధానులతో వైకాపా నేతలకు ఆర్థికంగా ఉపయోగం తప్ప...రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. మూడు రాజధానులతో ఏ ప్రాంతమూ అభివృద్ధి చెందే అవకాశం ఉండదని ఆయన అన్నారు. రూపాయి ఖర్చు లేకుండా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్మించవచ్చన్నారు. కేవలం వైకాపా నేతల జేబులు నింపేందుకే 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో ఎంత మందికి ఉపాధి కల్పిస్తారనే విషయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి ద్వారా సంపద సృష్టించి.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి