తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెదేపా అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ బహిరంగ లేఖ రాశారు.
2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో తనకు ప్రత్తిపాడు సీటు కేటాయించడం జరిగిందన్నారు. ఓటమి సంకేతాలు కనిపిస్తున్నా... పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసినట్లు వివరించారు. అమరావతి ఉద్యమం జరుగుతున్న సమయంలో మండలి సమావేశాలు వివాదాస్పదమవుతాయని ఊహించినట్లు చెప్పారు. శాసనసభ-శాసన మండలి మధ్య సమతుల్యత దెబ్బతింటుందని భావించానని.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం కలుగుతుందని భావించే శాసనమండలి సమావేశాలకు వెళ్లలేదని లేఖలో పేర్కొన్నారు. అయితే మండలి సమావేశాలకు ముందే తాను వైకాపా వైపు మొగ్గు చూపినా వారితో ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పారు. ఐకాస పేరుతో తనమీద ఆరోపణలు చేశారని లేఖలో వివరించారు. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన తానూ... ఏ పదవిలో ఉన్నా ప్రజలకు చేరువగా ఉంటానని బహిరంగ లేఖలో వివరించారు.
ఇదీ చదవండి: అవినీతికి పాల్పడితే మూడేళ్ల జైలు