వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. కుంభకోణాల గురించి విజయసాయిరెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 43 వేల కోట్లు కొట్టేసిన వ్యక్తి... 900 కోట్ల ఈఎస్ఐ స్కాం అంటూ అల్లరి చేయడం విచిత్రమని ఎద్దేవా చేశారు.
టెలీహెల్త్ సర్వీసెస్లో 3 కోట్ల కుంభకోణం జరిగిందని ... ఆనాడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుకి సంబంధం లేదని విజిలెన్స్ రిపోర్ట్ స్పష్టంగా చెబుతోందని గుర్తు చేశారు. కేవలం జగన్రెడ్డి లక్ష కోట్ల అవినీతి వెలికి తియ్యడంలో అచ్చెన్నాయుడు కుటుంబం కీలక పాత్ర పోషించిందనే కక్షతోనే అరెస్ట్ చేయించారని ఆరోపించారు. జగన్ పెట్టిన అక్రమ కేసులు నిలబడవని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: కడప జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి