తెలుగు దేశం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపారు. హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ స్ఫూర్తితో వర్ధమాన క్రీడాకారులంతా రాణించాలని ఆకాంక్షించారు. క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు ఆనందం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో మరింత మంది సింధు, శ్రీకాంత్, సాయి ప్రణీత్లుగా తయారు కావాలని కోరారు. కెరీర్‌గా క్రీడలను ఎంపిక చేసుకున్నవారికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు తోడ్పడాలన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం విశేష కృషి చేసిందని వ్యాఖ్యానించారు. నవ నగరాల అభివృద్ధిలో భాగంగా...అమరావతితో పాటు తిరుపతి, విశాఖలోనూ స్పోర్ట్స్ సీటీ అభివృద్ధికి కృషి చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'హామీలు ఇచ్చాక..తప్పించుకోవడం కుదరదు'