- రెండో డోస్: వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద భారీ క్యూ
కొవిడ్ రెండో డోస్ టీకా కోసం ప్రజలు బారులుతీరారు. ఉదయం 6 గంటల నుంచే.. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద క్యూ కట్టారు. ప్రకాశం, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో సెకండ్ డోస్ కోసం పెద్దసంఖ్యలో వచ్చారు. రద్దీకి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిలకలూరిపేట చిన్నారి ప్రతిభ.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు!
చిలకలూరిపేటకు చెందిన తొమ్మిదేళ్ళ చిన్నారి బాలిక ఫజీలా.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్ధానం సొంతం చేసుకుంది. రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టికలోని మూలకాలను తక్కువ సమయంలో పేర్చటంలో ఫజీలా ఈ అవార్డు సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆక్సిజన్ సిలిండర్ల అక్రమ నిల్వల గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్
అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ చేస్తూ బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తిని విశాఖ ఔషధ నియంత్రణ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నిందితుడు జగదీష్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో 4లక్షల కరోనా కేసులు- 4వేల మరణాలు
దేశంలో కరోనా తీవ్రత ఆందోళకరంగా మారింది. తాజాగా.. 4 వేలకు పైగా మరణాలు సంభవించాయి. మరోసారి రోజువారి కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లాక్డౌన్ ఉన్నా.. ముంబయికి పోటెత్తున్న వలస కార్మికులు
అసెంబ్లీ ఎన్నికలు, హోలీ వేడుకలు, కరోనా వంటి పలు కారణాలతో మహారాష్ట్ర నుంచి వెళ్లి పోయిన వలస కార్మికులు.. తిరిగి ముంబయి బాట పట్టారు. ఆ రాష్ట్రంలో కఠిన లాక్డౌన్ అమల్లో ఉన్నా.. రైళ్ల ద్వారా రోజుకు సుమారు 50వేల మంది వాణిజ్య నగరానికి చేరుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తమిళనాడులో పూర్తిస్థాయి లాక్డౌన్
కరోనా కట్టడికి రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా లాక్డౌన్ తరహా ఆంక్షలవైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి 24 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెరిగిన నిరుద్యోగం.. సమర్థించుకున్న బైడెన్
అమెరికాలో నిరుద్యోగం మరింత పెరిగింది. కొత్తగా పది లక్షల ఉద్యోగాలు వస్తాయని అమెరికా ఆర్థికవేత్తలు అంచనా వేశారు. అయితే ఆ దేశ కార్మికశాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం అవి కేవలం 2లక్షల 66 వేలకు మాత్రమే పరిమితం అయినట్లు స్పష్టం అయ్యింది. దీనిపై అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేవలం మూడు నెలల్లో పెద్దమొత్తంలో ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వ్యయం పెరిగితేనే ఆర్థికానికి ఊపు
కరోనా రెండో దశ విజృంభణ- ఆర్థిక వృద్ధి ఆశలపై నీళ్లు చల్లుతోంది. భారతదేశ జీడీపీకి అత్యధిక వాటాను అందించే పారిశ్రామిక రాష్ట్రాల్లో కొవిడ్ దెబ్బకు పాక్షిక లాక్‌డౌన్‌లు విధించడం దేశ జీడీపీని కుంగదీయనుంది. ఈ గడ్డు పరిస్థితుల్లో పేదల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీని అత్యవసరంగా పునరుద్ధరించాలని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఐపీఎల్ నిర్వహణకు శ్రీలంక రెడీ'
ఐపీఎల్-14 రెండో అంకానికి అతిథ్యమిచ్చేందుకు శ్రీలంక ఆసక్తి చూపింది. ఈమేరకు బీసీసీఐ అనుమతించాలని శ్రీలంక క్రికెట్ కమిటీ ఛీఫ్ అర్జున డిసిల్వ కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కొన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనాను తరిమేద్దాం'
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓ వీడియో సందేశం ఇచ్చారు నటుడు విజయ్ దేవరకొండ. భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.