ETV Bharat / city

భారతీయులకు భయం అక్కర్లేదు - etv bharat ms reddy interview news

అతి శుభ్రతే అమెరికా కొంపముంచిందనీ, మన జీవన విధానమే మనకు రక్ష అని అన్నారు అమెరికాలో వైరాలజిస్టు డాక్టర్ ఎమ్ఎస్ రెడ్డి. జాగ్రత్తలు పాటిస్తే చాలని భరోసానిస్తున్నారు. ఈటీవీ భారత్​ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన ఎన్నో విషయాలు తెలియజేశారు.

etv bharat interview with virology doctor ms reddy
వైరాలజిస్టు డాక్టర్ ఎమ్ఎస్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి
author img

By

Published : May 23, 2020, 10:59 AM IST

Updated : May 23, 2020, 11:37 AM IST

భారతీయులకు భయం అక్కర్లేదు భారతీయుల్లో సహజంగా ఉండే యాంటీబాడీలు కరోనాను ఎదుర్కొంటాయని, అందుకే భయపడాల్సిన పనిలేదని ప్రవాసాంధ్రులు, వైరాలజిస్ట్‌, అమెరికాలో వ్యాపారవేత్త డా.ఎమ్‌.ఎస్‌.రెడ్డి భరోసా ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ విషయంలో భారత్‌ వంటి దేశాలు చైనాను గుడ్డిగా అనుసరించడమూ తప్పిదమేనన్నారు. దీనివల్లనే ఆర్థిక వ్యవస్థలన్నీ బాగా దెబ్బ తిన్నాయని గుర్తుచేశారు.

వైరాలజిస్టు డాక్టర్ ఎమ్ఎస్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి

అమెరికాకు వెళ్లిన తొలితరం శాస్త్రవేత్త:

అమెరికాలో డా.ఎమ్‌.ఎస్‌.రెడ్డిగా ప్రసిద్ధి చెందిన డా.మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డిది నెల్లూరు జిల్లా ఉప్పలపాడు. ఆయన భారత్‌ నుంచి అమెరికా వెళ్లిన తొలితరం శాస్త్రవేత్త. అక్కడ మైక్రోబయాలజీలో ఎమ్మెస్‌, వైరాలజీలో పీహెచ్‌డీ చేశారు. ఇంటర్నేషనల్‌ మీడియా అండ్‌ క్లస్టర్స్‌ అనే డెయిరీ ఉత్పత్తుల సంస్థను స్థాపించి, ఆ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. పాల ఉత్పత్తుల నిల్వకు ఉపయోగపడేలా స్వయంగా పలు వైరస్‌లను అభివృద్ధి చేశారు. తన పరిశోధనలకు దాదాపు వంద వరకు పేటెంట్లను సాధించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈటీవీ-భారత్​తో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.

  • ఈటీవీ భారత్​: కరోనా వైరస్‌తో భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. వైరాలజిస్టుగా మీకున్న అనుభవంతో చెప్పండి. అది ఎందుకింత ప్రమాదకరంగా మారింది...?

ఎమ్​ఎస్సార్​: వైరస్‌ 6నెలల కిందట వుహాన్‌లో వెలుగుచూసింది. దాన్ని అక్కడే అరికట్టాల్సి ఉన్నా... అలా జరగలేదు. అది ప్రమాదకరమని మార్చి వరకూ గుర్తించలేకపోయాం. ఈలోగా ప్రపంచమంతటా విస్తరించింది. వేగంగా వ్యాపిస్తుండటంతోనే నియంత్రణ కష్టమవుతోంది.

  • ఈటీవీ భారత్​: సార్స్‌, మెర్స్‌, ఎబోలా వంటి వైరస్‌లను ప్రపంచం చూసింది. అవేమీ మహమ్మారిగా రూపుదాల్చలేదు. కోవిడ్‌ విషయంలోనే ఇలా ఎందుకు జరిగింది?

ఎమ్​ఎస్సార్​: కొవిడ్‌కు కారణమైన సార్స్‌ కోవ్‌-2 ఆర్‌ఎన్‌ఏ రకమైనా కొంచెం విభిన్నం. దీని చుట్టూ కొమ్ములు ఉండటంతో జీవకణాలకు బలంగా అతుక్కుంటుంది. ఈ వైరస్‌ లోపల 10 జీన్స్‌ ఉన్నాయి. మానవకణాన్ని అతుక్కున్న వెంటనే దాన్ని చంపేసి... విస్తరిస్తుంది. ఇది చిన్న స్పర్శకే వ్యాపిస్తుంది. అందువల్లే ఇంతలా విస్తరించింది.

  • ఈటీవీ భారత్​: ఇది మనిషిపై ఏవిధంగా దాడి చేస్తుంది...?

ఎమ్​ఎస్సార్​: కరోనాలో ఎక్కువ శాతం కొవ్వు పదార్థమే ఉంటుంది. కాబట్టి సబ్బుతో చేతులు కడుక్కుంటే పోతుంది. 80% మంది ఇలాగే రక్షణ పొందుతారు. 15% మందిలో నోరు, ముక్కు ద్వారా ఊపరితిత్తుల వరకూ ప్రవేశిస్తుంది. వెంటనే మన రోగ నిరోధక వ్యవస్థ ఉత్తేజితమై వైరస్‌తో పోరాడుతుంది. అప్పుడు మనకు దగ్గు, జలుబు వస్తాయి. ఒక 5% మందిలో ప్రమాదకరంగా మారుతుంది. వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కొవిడ్‌ వైరస్‌ చాలా తెలివైంది. ఇది ఊపిరితిత్తుల అడుగుభాగానికి చేరిపోతోంది. ఊపిరితిత్తుల రక్షణకు విడుదలయ్యే సబ్బు లాంటి పదార్ధాన్ని విడుదలవకుండా అడ్డుకుంటుంది. దీంతో ఊపిరిత్తుల్లో ద్రవాలు పెరిగిపోయి. శ్వాస సమస్య వస్తుంది. ప్రాణాలూ పోవచ్చు.

  • ఈటీవీ భారత్​: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో కేసులు రావడం, లక్షల్లో చనిపోవడం ఆందోళనకరమే కదా..?

ఎమ్​ఎస్సార్​: మొత్తం కేసుల్లో సగానికి పైగా అమెరికా, యూరోప్‌లోని కొన్ని దేశాల్లోనే ఉన్నాయి. అక్కడ వైరస్‌ విజృంభించడానికి వేరే కారణాలున్నాయి. దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో కేసుల సంఖ్య తక్కువుగా ఉండటాన్ని బట్టి చూస్తే.. ఈ వైరస్‌ అందరిపై ఒకేలాంటి ప్రభావాన్ని చూపడం లేదని అర్థమవుతుంది.

  • ఈటీవీ భారత్​: వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారయ్యాక అవి ఎన్ని రోజులు శరీరంలో ఉంటాయి?

ఎమ్​ఎస్సార్​: అది వాటి జన్యుక్రమంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల యాంటీబాడీలు జీవితాంతం ఉంటాయి. వృద్ధాప్యంలో తగ్గుతాయి.

  • ఈటీవీ భారత్​: సహజ యాంటీబాడీలు కాకుండా ఈ వైరస్‌ను నిలువరించడానికి మనం అనుసరించాల్సిన విధానాలు ఏమిటి..?

ఎమ్​ఎస్సార్​: భారతీయ జీవన విధానంలో దీనికి పరిష్కారముంది. మనం భోజనానికి ముందు, తర్వాత చేతులు కడుక్కుంటాం, చెప్పులతో ఇంట్లోకి రానివ్వం. ఇవన్నీ వైరస్‌ను దూరం పెట్టేవే. మనం ఎక్కువగా పసుపు, వెల్లుల్లి, లవంగాలను వంటల్లో వాడతాం. ఇవన్నీ యాంటీ వైరల్‌. మనం తీసుకునే మజ్జిగ, పెరుగు జీర్ణకోశంలో ప్రో బయాటిక్స్‌ను తయారు చేస్తాయి. వీటి ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక వైరస్‌లు రాకుండా ముందు జాగ్రత్తగా వాడే మందులు సైతం ఉన్నాయి. విటమిన్లూ వాడుతున్నాం. వైరస్‌లోని జీవపదార్థం... మన కణజాలంలోకి వెళ్లకుండా ఆపే మందులు ఉన్నాయి.

  • ఈటీవీ భారత్​: కరోనా మానవ సృష్టే అనే వాదన ఉంది. దీనిపై అమెరికా, చైనాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి...?

ఎమ్​ఎస్సార్​: ఇది రాజకీయపరమైన అంశం. వైరస్‌లో మ్యూటేషన్లు జరుగుతున్నాయి. భారీగా విస్తరిస్తోంది. అంటే... బయో ఆయుధంగా మలచడానికీ అవకాశముంది. దాన్ని వుహాన్‌లో రూపొందించారని చెబుతున్నారు. అలా జరిగే అవకాశాన్నీ కాదనలేం. నిజ నిర్ధారణకు అమెరికాతోపాటు ఇతర దేశాలూ దర్యాప్తు చేస్తున్నాయి.

  • ఈటీవీ భారత్​: లాక్‌డౌన్‌ లేకపోతే పరిస్థితి చేయిదాటి పోయేదని అంటున్నారు కదా?

ఎమ్​ఎస్సార్​: లాక్‌డౌన్‌ లేకపోయినా పెద్దగా నష్టం జరిగేది కాదు. వైరస్‌ వ్యాప్తి చెంది హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేది. మొత్తం లాక్‌డౌన్‌ చేయకుండా... వైరస్‌ సోకిన వారినే వేరు చేసి ఉంటే సరిపోయేది. యువకులకు సమస్య లేదు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకుని ఆర్థిక వ్యవస్థను కొనసాగించి ఉంటే ఇంతటి నష్టం జరిగుండేది కాదు.

  • ఈటీవీ భారత్​: మీరు పరిశోధకులు. వ్యాపారవేత్త కూడా..! ఈ వైరస్‌ వైద్య, వాణిజ్య వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసింది. అసలు ఎలాంటి సవాలు విసిరింది?

ఎమ్​ఎస్సార్​: ఇది ప్రపంచం మొత్తానికి దారుణమైన దెబ్బ. చైనా పొరపాటు చేసింది. వైరస్‌ వ్యాప్తి చెందినప్పుడు... అది మిగతా దేశాలను అప్రమత్తం చేయలేదు. వైరస్‌ వెలుగు చూశాకా అక్కడ్నుంచి 2నెలలపాటు ప్రపంచమంతా విమానాలు తిరిగాయి. ఫలితంగా 200 దేశాలకు వ్యాపించింది. ఆర్థికరంగంపై నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే... ప్రపంచమంతా చైనాను గుడ్డిగా అనుసరించింది. చైనా ఒక్క నగరాన్నే లాక్‌డౌన్‌ చేసింది. అక్కడ లాక్‌డౌన్‌ ఉన్నప్పుడు ప్రపంచమంతా వ్యాపారం జరిగింది. ఇప్పుడు ప్రపంచం షట్‌డౌన్‌ కాగానే చైనా వ్యాపారం చేసుకుంటోంది. భారత్‌లో లాక్‌డౌన్‌తో ఊహించనంత నష్టం జరిగింది.

  • ఈటీవీ భారత్​: అమెరికా వైద్యపరంగా ఉన్నత ప్రమాణాలున్న దేశం. శుభ్రత, స్వచ్ఛతలోనూ ముందుంటుంది. అక్కడే ఎందుకు ఇలాంటి పరిస్థితి..?

ఎమ్​ఎస్సార్​: ప్రజల అతి శుభ్రతే... అక్కడ అనర్థానికి కారణం. భారత్‌లో అపరిశుభ్రతతో సాల్మనెల్లా, డయేరియా వంటివి వస్తాయి. వాటికి యాంటీ బ్యాక్టీరియల్‌ మందులు వాడుతుంటాం. అమెరికన్లు బ్యాక్టీరియా రహిత ఆహారం ఎక్కువగా తీసుకోవడంతో సమస్యలు వస్తున్నాయి. అమెరికాలో శుద్ధి చేసిన ఆహారంలో ఒక గ్రాముకు... 10-100 బ్యాక్టీరియాలు కూడా ఉండవు. కానీ భారత్‌లో లక్షలు, మిలియన్లలో ఉంటాయి. ఆహారంలో బ్యాక్టీరియాలు లేకపోతే మన రోగనిరోధక వ్యవస్థ శత్రువును ఎదుర్కొనే స్థాయిలో వృద్ధి చెందదు.

  • ఈటీవీ భారత్​: ఉష్ణమండల దేశాల్లో కరోనాను ఎదుర్కొనే సహజ సామర్థ్యం ఉందని చెబుతున్నారు. భారత్‌లో బీసీజీ టీకా, మలేరియా మందులు తీసుకోవడంతో వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యం వచ్చిందంటారు...

ఎమ్​ఎస్సార్​: ఇది వాస్తవమని అనుకోవడం లేదు. భారత్‌లో కారణాలు వేరు. మన దగ్గర చిన్నప్పటి నుంచి మట్టిలో, వీధుల్లో ఆడుతుంటాం. బ్యాక్టీరియా దాడికి గురవుతుంటాం. 13 ఏళ్లు వయసు వచ్చే నాటికే... పిల్లలపై ఆరు కోట్ల బ్యాక్టీరియా, వైరస్‌లు దాడి చేస్తాయి. దీంతో సహజంగానే శరీరం యాంటీబాడీస్‌ను తయారు చేసుకుంటుంది. ఇవన్నీ మన మెమరీలో నిక్షిప్తమవుతాయి. మళ్లీ అలాంటి వైరస్‌ దాడి చేసినప్పుడు... క్షణకాలంలోనే ఈ యాంటీబాడీలు స్పందించి వైరస్‌ను నిలువరిస్తాయి.

  • ఈటీవీ భారత్​: అంటే కరోనా తరహా వైరస్‌ల దాడికి మనం ఇంతకు ముందే గురయ్యామని మీ ఉద్దేశమా..?

ఎమ్​ఎస్సార్​: అవును. కొత్త వైరస్‌లో కొత్త జీనోమ్‌ వచ్చినా కూడా ఈ యాంటీబాడీస్‌ నిలువరిస్తాయి. మన అలవాట్లపై చిన్నచూపు చూస్తారు కానీ.. మన అలవాట్లే మనల్ని కాపాడుతున్నాయి. చేతులతో ఆహారాన్ని తినడం, బయట ఆడుకోవడంతో మన రోగ నిరోధక శక్తి పెరిగింది.

ఇదీ చదవండి: పాక్​ గగన విషాదం: 97కు చేరిన మృతుల సంఖ్య

Last Updated : May 23, 2020, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.