- సెప్టెంబర్ 1న సీఎం జగన్ ఇంటిని ముట్టడిస్తాం
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లలో సీపీఎస్ విధానం రద్దు చేసినప్పుడు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎందుకు రద్దు చేయలేదు అని ఏపీసీపీఎస్ యూఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రశ్నించారు. వైకాపా సర్కారు వెంటనే సీపీఎస్ రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
- ఎంపీ గోరంట్ల గోబ్యాక్ అంటూ తెదేపా శ్రేణుల ఆందోళన
హిందూపురంలో వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ను తెదేపా శ్రేణులు అడ్డుకున్నారు. ఎంపీ గోరంట్ల గో బ్యాక్ అనే నినాదాలతో హోరెత్తించారు. దీంతో వైకాపా శ్రేణులు ప్రతి నినాదాలతో రెచ్చిపోయారు. ఫలితంగా ఉద్రిక్తత నెలకొంది.
- రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు
75TH INDEPENDENCE రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు మొదలు, పాఠశాలలు, పార్టీ ఆఫీసులు జాతీయ జెండాలతో రెపరెపలాడాయి. పిల్లల నుంచి పెద్దల వరకు జాతీయగీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు.
- నెల్లూరులో మైనర్ బాలికపై అత్యాచారయత్నం, కామాంధుడికి స్థానికుల దేహశుద్ధి
RAPE ATTEMPT ON MINOR దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నా మహిళలు, బాలికలు, చిన్నారులపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. వావివరసలు మర్చిపోయి బాలికలకు మాయమాటలు చెప్పి వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఓ చిన్నారిపై అత్యాచారం చేయబోయిన ఘటన నెల్లూరులో వెలుగుచూసింది.
- 1984లో గల్లంతైన జవాన్ ఆచూకీ ఇన్నేళ్లకు లభ్యం, దారి చూపిన డిస్క్‌లు
ఆ జవాను కనిపించకుండా పోయి 38 ఏళ్లు దాటింది. ఏమైపోయారో, అసలు ఉన్నారో లేదో తెలియకుండానే అనేక సంవత్సరాలుగా దిగులుతో గడుపుతోంది ఆయన కుటుంబం. అలాంటి వారికి ఇప్పుడు కీలక వార్త చెప్పారు ఇండియన్ ఆర్మీ అధికారులు.
- న్యాయం చేసే బాధ్యత మూడు వ్యవస్థలది, కోర్టులది మాత్రమే కాదు
ప్రజలకు న్యాయాన్నిఅందించడం కేవలం న్యాయస్థానాలదే బాధ్యత అనే భావనను రాజ్యాంగం తొలగిస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఆవరణలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కరోనా మహమ్మారి వల్ల గత 16 నెలల్లో కేవలం 55 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు భౌతిక విచారణలు జరిపిందని తెలిపారు.
- లైగర్ సినిమాతో ఆ కోరిక తీరిందన్న విజయ్ దేవరకొండ
Vijay Devarkonda Liger Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా చిత్రం 'లైగర్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో దూకుడు పెంచిన 'లైగర్' టీమ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది.
- మళ్లీ హాట్‌టాపిక్‌గా షమీ భార్య, అలా చేయాలంటూ మోదీకి వినతి
Mohammed Shami wife: భర్తపై సంచలన ఆరోపణలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి వార్తల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఏం జరిగిందంటే..
- స్వతంత్ర భారత్ విజయాలు భళా అంటూ బైడెన్, పుతిన్ సందేశాలు
భారతదేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని కీర్తించారు జో బైడెన్. మరోవైపు ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు.