ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - టాప్ టెన్ న్యూస్

టాప్ టెన్ న్యూస్

top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Mar 14, 2021, 9:00 AM IST

కృష్ణా జిల్లా నూజివీడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో.. ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పేద, మధ్య తరగతులపై ధరల భారం

ఇంటి ఖర్చు తడిసిమోపెడవుతోంది. అటు పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌.. ఇటు నిత్యావసరాల ధరలు పరుగులు తీస్తున్నాయి. వంట నూనెలైతే భగ్గుమంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే.. లీటరు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఏకంగా 67% పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా పామాయిల్‌ ధర రూ.120 అయింది. వేరుసెనగ నూనె చుక్కలకేసి చూస్తూ.. రూ.165కి చేరింది. ప్రధానమైన పప్పుధాన్యాల్లో సెనగ మినహా మిగిలినవన్నీ 30% వరకు పెరిగాయి. కొన్నిరకాల సబ్బుల ధరలూ పెరిగాయి. కరోనాతో ఆదాయం అసలే అంతంతమాత్రంగా ఉందంటే.. ఇంటి ఖర్చులు సగటున 35% వరకు పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఓ ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'మహిళా న్యాయమూర్తుల కొరత ఆందోళనకరం'

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో కేవలం ఒక మహిళా జడ్జి ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. న్యాయవృత్తిలో మహిళల ఎదగుదలకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చిన్న కార్లకు మళ్లీ గిరాకీ!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా కార్లకు గొప్ప ఆదరణ లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్​లో నెలకొల్పిన యూనిట్​ ద్వారా దేశీయ మార్కెట్లో విక్రయించడం సహా 70 దేశాలకు ఎగుమతి చేస్తోంది. సొంత వాహనాల్లో ప్రయాణించాలన్న వినియోదారుల ఆలోచనే వాహన రంగం పుంజుకోవడానికి కారణమని కియా మోటార్స్​ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టే-జిన్‌ పార్క్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'డ్రాగన్ దూకుడుకు క్వాడ్ కళ్లెం'

క్వాడ్​ సమావేశాలపై అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సలివన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఘర్షణాత్మక వైఖరిని వీడుతుందన్న భ్రమలు తామెవరికీ లేవని నాలుగు దేశాల నేతలు విస్పష్టం చేశారన్నారు. ప్రపంచ దేశాలను వెంటాడుతున్న కరోనా వైరస్​ను తుదుముట్టించేందుకు క్వాడ్ అగ్రనేతలు కీలక నిర్ణయం తీసుకున్నారని ​వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • డకౌట్​ ట్వీట్​తో అభిమానుల ఆగ్రహం.. పోస్ట్​ డిలీట్​

డ్రైవింగ్​పై అవగాహన కోసం టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ డకౌట్​ను ఉపయోగించి ఉత్తరాఖండ్​ పోలీసులు చేసిన ట్వీట్​పై వివాదం చెలరేగింది. దీంతో ఆ పోస్ట్​పై అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆ ట్వీట్​ డిలీట్​ చేయకతప్పలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ కథకు మూడేళ్లు మెరుగులు దిద్దా!

తొలి సినిమాతోనే బాక్సాఫీసు వద్ద అత్యధిక కలెక్షన్లతో సత్తా చాటిన దర్శకుడు బుచ్చిబాబు సనా. ఆయన దర్శకత్వంలో రూపొందించిన 'ఉప్పెన' చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషాదరణ వస్తోంది. అయితే ఈ సినిమా తెరకెక్కించే క్రమంలో తాను ఎదుర్కొన్న సంఘటనలను పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.