- నేడు గవర్నర్‌తో ఎస్ఈసీ భేటీ.. ఎన్నికల ఏర్పాట్లపై చర్చ!
నేడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్‌ను కలవనున్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, అధికారులపై తీసుకుంటున్న చర్యల గురించి వివరించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏ అర్హతలుండాలి?
ఎన్నికలు జరుగతాయో లేదో అన్న అనుమానాలు... సుప్రీం కోర్టు తీర్పుతో నివృతి అయ్యాయి. ఇక స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. అధికారులు, ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే... అసలు సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేయటానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- ఈ రైల్వే స్టేషన్లో... లైట్లు, ఫ్యాన్లు మాటలు వింటాయి!
రాష్ట్రంలో ఏ రైల్వేస్టేషన్‌లో లేని విధంగా విశాఖ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు అధికారులు. ప్లాట్‌ఫామ్-1లో రూ.35 లక్షలతో లాంజ్‌ను అత్యాధునికీకరించారు. ప్రయాణికులు అబ్బురపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దయనీయం... తల్లిని పోషించేందుకు పిల్లలు యాచకం!
పెళ్లయిన కొన్నేళ్లకే భర్త ఆమెను వదిలేశాడు. అయినా కుంగిపోకుండా కూలీ పనులకు వెళ్తూ పిల్లలను చదివించేది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. రెండు ఊపిరితిత్తులూ పూర్తిగా పాడయ్యాయి. కదల్లేని స్థితిలో ఉన్న తల్లిని పోషించేందుకు బిడ్డలు యాచకులయ్యారు. తిరుపతిలో రోడ్డునే ఆవాసం చేసుకుంది ఆ కుటుంబం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది దుర్మరణం
రాజస్థాన్ టోంక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు ఢీకొని జీపులో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రిపబ్లిక్ డే రోజు అంబేడ్కర్ విగ్రహం ముందే కాల్పులు
మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పలువురు హద్దుమీరి ప్రవర్తించారు. రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ముందే తుపాకులను ఉపయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. వీడియో కోసం క్లిక్ చేయండి.
- వాట్సాప్‌కు దీటుగా 'సిగ్నల్' ఇస్తోంది
దిగ్గజ సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో ప్రైవసీ సమస్యపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయంలో అందుకు దీటుగా సరికొత్త యాప్ రూపుదిద్దుకుంది. నెటిజన్లు కూడా వాట్సాప్‌ను వదిలి ఆ యాప్‌ను వాడటం మొదలుపెట్టారు. అదే సిగ్నల్ యాప్. వాట్సాప్‌లో ఉన్న లోపాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిన ఈ యాప్ ప్రస్తుతం వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. మరి ఈ సిగ్నల్ చిట్కాల సంగతులేంటో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- పుతిన్‌కు బైడెన్ ఫోన్- ఆ విషయాలపై ఆందోళన
అమెరికా అధ్యక్ష హోదాలో తొలిసారి రష్యా అధ్యక్షుడితో మాట్లాడారు జో బైడెన్. న్యూస్టార్ట్ ఒప్పందాన్ని పొడగించేందుకు పిలుపునిచ్చారు. అమెరికన్లపై జరుగుతున్న సైబర్ దాడులు, నావల్నీ అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, పాలస్తీనాతో సంబంధాలు పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది అమెరికా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తగ్గేదే లేదు.. టీమ్ఇండియాపై గర్జిస్తా: స్టో
టీమ్ఇండియాతో తొలి రెండు టెస్టులకు దూరమవ్వడంపై విచారం వ్యక్తం చేసిన ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో.. తర్వాత మ్యాచ్‌లకు భారత్‌పై గర్జిస్తానని అన్నాడు. ఇటీవలే శ్రీలంకతో ఆడిన టెస్టు సిరీస్‌లో తాను భారీ స్కోర్లు చేయనందుకు భావోద్వేగానికి గురయ్యాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈనెల 29 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 'మాస్టర్'
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.