ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - andhrapradesh recent news

.

9 am top news
9 am ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 19, 2020, 8:58 AM IST

29న మూడో విడత రైతు భరోసా

రైతు భరోసా పథకం, ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్ రీసెర్చ్‌ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్వే అండ్‌ బౌండరీ చట్ట సవరణ, నూతన పర్యటక పాలసీని కేబినెట్‌ ఆమోదించింది. సమగ్ర భూసర్వేకు మంత్రివర్గం ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. నివర్ తుపాన్ నష్టం, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పలు నిర్ణయాలను తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇసుక సమస్య.. అనుకూలంగా మార్చుకుంటున్న అక్రమార్కులు..!

ఇసుక సరఫరాలో సమస్యలేవీ లేవని... నాణ్యమైన ఇసుకనే అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులు ముప్పుతిప్పలు పడుతున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా కొనసాగుతున్న ఇసుక బుకింగ్‌లో... సర్వర్‌ సతాయింపు ఎక్కువగా ఉంటోంది. అవసరమైన రకం ఇసుక కాకుండా... వేరే రకం ఇస్తున్నారని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'జస్టిస్‌ జేకే మహేశ్వరి బదిలీ ఆపండి'

3 రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై తీర్పు వచ్చేవరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి బదిలి ఆపేయాలని కోరుతూ...రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్లాలి: సీఎం జగన్

ఈనెల 25 నుంచి 15 రోజుల పాటు.. గ్రామగ్రామానికీ వెళ్లి... ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల ప్రచారానికి ఇదో మంచి అవకాశంగా అభివర్ణించారు. చిన్నచిన్న కారణాలకు రేషన్‌ కార్డులు తొలగించవద్దని... అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • '2050కల్లా 4.5కోట్ల మంది భారతీయుల వలస'

భారత్​లో 2050కల్లా 4.5 కోట్ల మందికి పైగా బలవంతంగా వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడనుందని ఓ నివేదిక వెల్లడించింది. వాతావరణ విపత్తులతో 2020లో ఇప్పటికే భారత్‌లో 1.4 కోట్ల మంది తాము ఉన్న ప్రాంతాల నుంచి తరలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని నివేదిక తెలిపింది. యాక్షన్‌ ఎయిడ్‌ ఇంటర్నేషనల్‌, క్లైమేట్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ సౌత్‌ ఆసియా కలిపి ఈ నివేదికను రూపొందించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గుజరాత్​లో ఫంగస్​ ఇన్ఫెక్షన్​- 9 మంది మృతి

ఇటీవల దిల్లీలో బయటపడిన అరుదైన ఫంగస్​ ఇన్ఫెక్షన్​ ఇప్పుడు గుజరాత్​లోనూ వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది. మ్యూకోర్మైకోసిస్​గా పిలిచే ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'చెరుకు మద్దతు ధరను తగ్గించలేం'

చెరుకు మద్దతు ధరను తగ్గించలేమని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా అమలులో ఉన్న ఈ పద్ధతిని మార్చడం క్షేత్రస్థాయిలో సాధ్యం కాదన్నారు. ఎగుమతలపై ప్రభుత్వం నిర్ణయించిన రూ.3,500 కోట్ల రాయితీ పరిశ్రమకు మేలు చేస్తుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పతక పంచ్​: ప్రపంచకప్​ సెమీస్​లోకి హైదరాబాదీ

అంతర్జాతీయ వేదికపై హెదరాబాద్​ కుర్రాడు అదరగొట్టాడు. ప్రపంచకప్​ బాక్సింగ్​ టోర్నీలో మహ్మద్​ హుసాముద్దీన్​.. సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకం చేజిక్కించుకున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో జర్మనీ క్రీడాకారునిపై నెగ్గి ఈ ఘనత సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'సీమ ఓబులమ్మ'గా రకుల్​ప్రీత్​ సింగ్​!

ఎప్పుడూ గ్లామర్​ రోల్సే కాదు. విభిన్నమైన పాత్రలు పోషించడానికీ సిద్ధంగా ఉంటానని అంటోంది హీరోయిన్​ రకుల్​ప్రీత్​ సింగ్​. తన కొత్త సినిమాలో డీగ్లామర్​ పాత్రలో నటించినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.