ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm - andhrapradesh latest news

.

7 pm top news
7pm ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 24, 2020, 7:00 PM IST

  • ఎస్పీ బాలుకు తీవ్ర అస్వస్థత

గాయకుడు ఎస్పీ బాలుసుబ్రహ్మణ్యం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాసేపట్లో బాలు ఆరోగ్యంపై ప్రకటన చేయనుంది ఆస్పత్రి యాజమాన్యం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తగ్గని వ్యాప్తి

రాష్ట్రంలో కొత్తగా 7, 855 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో 49 కరోనాతో చనిపోయినట్లు బులిటెన్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా..?

సీఎం జగన్​ డిక్లరేషన్ ఇవ్వకుండా శ్రీవారిని దర్శించుకోవడాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తే నిబంధనలు ఉల్లంఘిస్తే... ప్రజలకు ప్రభుత్వ నిర్ణయాలపై గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాష్ట్ర ఖ్యాతి దిగజారేలా వ్యవహరిస్తే... ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వింతవ్యాధితో విదేశీ విహంగాలు విలవిల

ఎన్నో దేశాలు దాటి విజయనగరం జిల్లాకు వస్తుంటాయి సైబీరియన్ విహంగాలు. ఏటా ఈ పక్షులు శీతల దేశం సైబీరియా నుంచి సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తుంటాయి. అయితే కొన్నిరోజులుగా ఈ విదేశీ అతిథులను వింత వ్యాధి కబళిస్తోంది. చెట్టు మీద నుంచి కింద పడి గిలగిల కొట్టుకుంటూ మృత్యువాతపడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై కేంద్రానికి నోటీసులు

కేంద్రం, యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​కు సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. కరోనా నేపథ్యంలో సివిల్స్​-2020 పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్​పై ఇరువురి స్పందన కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'రైతుల తర్వాత ఈసారి కార్మికులపై దోపిడి'

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. రైతుల తర్వాత కార్మికులను లక్ష్యంగా చేసుకుని మూడు కీలక బిల్లులను తీసుకొచ్చారని, పేదలను దోపిడీ చేసి స్నేహితులను పోషించటం మోదీ జీ నైజమని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆ విమానాల్లో జియో మొబైల్ సేవలు- ప్లాన్లు ఇవే

అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో మొబైల్​ సేవలు వాడుకునేందుకు వీలుగా రిలయన్స్ జియో మూడు ప్లాన్​లను విడుదల చేసింది. ఇందుకోసం పలు దిగ్గజ విమాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది జియో.రూ.499, రూ.699, రూ.999తో ఆవిష్కరించిన కొత్త ప్లాన్ల వివరాలు తెలుసుకోవటం కోసం క్లిక్ చేయండి.

  • కరోనా టీకా​ 'హ్యూమన్ ఛాలెంజ్​'కు బ్రిటన్​ రెడీ

వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో భాగంగా బ్రిటన్ మరో ముందడుగు వేయనుంది. తాజాగా హ్యూమన్‌ ఛాలెంజ్‌ ప్రయోగాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వీటిలో పాల్గొన్న వలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చిన తరువాత వారికి వైరస్‌ సోకేలా చేస్తారు. అనంతరం వైరస్‌ సమర్థతను పరీక్షిస్తారు. ఇప్పటికే తుదిదశకు చేరుకున్న వ్యాక్సిన్‌ ప్రయోగాలకు, తాజా విధానం మరో ముందడుగు కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒకే జట్టుపై గెలిచి ముంబయి సరికొత్త రికార్డు

ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. కోల్​కతాపై అత్యధికంగా 26 మ్యాచ్​ల్లో 20 సార్లు విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఓటీటీకే ఓటేస్తున్న అగ్రతారల సినిమాలు!

కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఒకవేళ ఇప్పట్లో తెరుచుకున్నా.. ప్రేక్షకులు ధైర్యం చేసి సినిమా హాళ్లకు వస్తారా అనేది ప్రశ్న. ఈ క్రమంలోనే అనేక సినిమాలు ఓటీటీవైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే తెలుగు నుంచి అనేక చిత్రాలు డిజిటల్​ ప్లాట్​ఫామ్​ వేదికగా ప్రేక్షకులను పలకరించాయి. ఇప్పుడు అగ్రతారల చిత్రాలూ అదేబాట పడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.