ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - ప్రధాన వార్తలు

.

top news
టాప్ టెన్ న్యూస్
author img

By

Published : Feb 8, 2021, 5:00 PM IST

  • విశాఖ, ఏఎంఆర్డీయే ప్రాజెక్టులపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
    విశాఖపట్నం, ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ) పరిధిలో ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వీటి పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రేపు 2,724 పంచాయతీల్లో ఎన్నికలు: జి.కె.ద్వివేది
    రేపు 2,724 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని జి.కె.ద్వివేది వెల్లడించారు. పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా ఏర్పాటు చేశామని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఎన్నికలను బహిష్కరించిన నడుపల్లికోట వాసులు
    తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సరైన సమయం ఆసన్నమైందని భావించారు ఆ గ్రామస్థులు. అనుకున్నదే తడవుగా తమ నిర్ణయాన్ని అమల్లో పెట్టారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తమ సమస్యలు పరిష్కరించే వరకు ఎన్నికల్లో పాల్గొనబోమని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతోపాటు అన్ని సామాజిక వర్గాలతో కలిపి ఏర్పాటు చేసిన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటించడంతో పాటు గ్రామ నడిబొడ్డులో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ గ్రామం గురించి తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
  • ఉద్యోగుల వేతన బకాయిలను 6 శాతం వడ్డీతో చెల్లించండి: సుప్రీం
    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన బకాయిల వడ్డీ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. 12 శాతం వడ్డీ.... బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువన్న సుప్రీం కోర్టు.. ఆరు శాతం వడ్డీ చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 18 మంది మృతి- 202 మంది గల్లంతు
    ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో సంభవించిన వరదల్లో ఇప్పటి వరకు 18మంది మృతి చెందారు. వీరి మృతదేహాలను సాహాయక బృందాలు బయటకు తీశాయి. ఇంకా 202మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • సాగు చట్టాలపై నినాదాలు- లోక్​సభ వాయిదా
    లోక్​సభ మొదలైన 10 నిమిషాల్లోనే వాయిదా పడింది. నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని విపక్ష సభ్యులు నినాదాలు చేయడం వల్ల సభాపతి ఓం బిర్లా 5 గంటల వరకు లోక్​సభను వాయిదా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
    పసిడి, వెండి ధరలు సోమవారం స్పల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.94 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.340 పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • భారత్​ లక్ష్యం 420- అశ్విన్​కు 6 వికెట్లు
    టీమ్​ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​లో 178 పరుగులకే ఆలౌట్​ అయింది. ఫలితంగా భారత్​ ముందు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో అశ్విన్​(6), నదీమ్​(2), ఇషాంత్​ శర్మ, బుమ్రా తలో వికెట్​ దక్కించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'టైగర్ 3' కోసం సిద్ధమవుతున్న సల్మాన్​!
    ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు కొనసాగింపుగా తీస్తున్న 'టైగర్ 3' షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే కరోనా కేసుల దృష్ట్యా లోకేషన్​లో మార్పు జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.