- బలపడి.. మళ్లీ వాయుగుండంగా..!
వాయుగుండం ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గాకు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్టు ఐఎండీ తెలిపింది. ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడే సూచనలున్నట్లు వెల్లడించింది. 16వ తేదీనాటికి అరేబియా సముద్రంపైకి వెళ్లిన అనంతరం మళ్లీ బలపడి వాయుగుండంగా మారనున్నట్టు ఐఎండీ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విజయవాడ సీపీ కార్యాలయ ఉద్యోగి హత్య కేసులో నిందితుల గుర్తింపు!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స్పష్టించిన విజయవాడ సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు పాల్పడిన నిందితులు గోవాలో ఉన్నట్లు గుర్తించారని సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని విచారించాక హత్య కేసు వివరాలను వెల్లడించే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగం, క్యాత్ ల్యాబ్ ప్రారంభం
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కార్డియాక్ విభాగం, క్యాత్ ల్యాబ్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కార్డియాక్ సెంటర్‌ను అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైఎస్‌ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం నిధులు విడుదల
రాష్ట్రప్రభుత్వం వైఎస్‌ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలుకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి రూ.6.05 కోట్ల పాలన అనుమతులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. భద్రతాదళాలు నిర్బంధ తనిఖీ చేపట్టగా.. ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపారు. దీటుగా స్పందించిన సైన్యం వారిని మట్టుబెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జమ్ముకశ్మీర్ కోసం పోరాటం కొనసాగుతుంది: ముఫ్తీ
పద్నాలుగు నెలల నిర్బంధం నుంచి విడుదలైన జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ.. కేంద్రంపై మాటల దాడి చేశారు. జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. గతేడాది ఆగస్టులో కేంద్రం తీసుకున్న నిర్ణయం బాధించిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆర్థిక షేర్ల దన్నుతో మార్కెట్లకు స్వల్ప లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో మగిశాయి. సెన్సెక్స్ 169 పాయింట్లు పెరిగి 40,795 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 37 పాయింట్ల మెరుగై 11,971 మార్క్ వద్ద నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ చికిత్సతో సూపర్‌మ్యాన్ అయిపోయా: ట్రంప్
కరోనాను జయించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తనకు తాను సూపర్‌మ్యాన్‌గా అభివర్ణించుకున్నారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. తన రోగనిరోధక శక్తిపై గొప్పలు చెప్పుకొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- న్యూజిలాండ్ వృద్ధ క్రికెటర్ జాన్ మృతి
న్యూజిలాండ్ టెస్టు మాజీ క్రికెటర్ జాన్ రైడ్ తుదిశ్వాస విడిచారు. దాదాపు 16 ఏళ్ల పాటు కివీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైరముత్తుపై చిన్మయి మరోసారి లైంగిక ఆరోపణలు
ఓ మహిళ సాహిత్య రచయిత వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేస్తూ పంపిన సందేశాన్ని ప్రముఖ గాయని చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకముందు చిన్మయితో సహా పలువురు మహిళలు వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.