ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 pm - update news of andhrapradesh

.

5 pm top news
5 pm ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 29, 2020, 5:01 PM IST

  • వ్యవసాయ పంటలకూ ఐక్యూఎఫ్ విధానం.. ప్రభుత్వం యోచన

ఇండివిడ్యూవల్లీ క్విక్ ఫ్రోజెన్ ఫుడ్స్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆచరిస్తున్న తారకమంత్రం. సరిగ్గా ఇదే అంశంపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి. ఆక్వా పరిశ్రమలో ఈ ఐక్యూఎఫ్ విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉన్నా.. ఇప్పుడు వ్యవసాయ పంటలకూ దీన్ని అనుసరించాలని నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'నా సోదరుడిపై దాడి కేసులో సీసీ కెమెరా దృశ్యాలు బహిర్గతం చేయాలి'

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో తన సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి కేసులో పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను బహిర్గతం చేయాలని న్యాయమూర్తి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో పోలీసులు రెండు రోజులుగా తమ కర్తవ్యాన్ని వదిలేసి ఓ మంత్రిని సంతృప్తి పరిచేందుకు చాలా ప్రయాసపడుతున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పివీ సింధుకు ఆన్​డ్యూటీ మరో ఏడాది పొడిగింపు

పివీ.సింధుకు మరో ఏడాది ఆన్ డ్యూటీ సౌకర్యం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా సింధు విధుల్లో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'బాబ్రీ' తీర్పు నేపథ్యంలో లఖ్​నవూలో భద్రత కట్టుదిట్టం

బాబ్రీ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో లఖ్​నవూ నగరంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. వదంతులు నమ్మొద్దని ప్రజలను కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'రేషన్ డీలర్' బహిరంగ ఎన్నిక- గ్రామ సభే వేదిక!

గ్రామాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లను ఎన్నుకోవడం సర్వసాధారణం. కానీ, రేషన్ డీలర్ ఎన్నిక ఎప్పుడైనా చూశారా? బహుశా ఆ అవకాశం మీకు వచ్చి ఉండదు. కానీ, ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ గ్రామంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి మరీ, రేషన్ డీలర్​ను ఎన్నుకున్నారు గ్రామస్థులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వచ్చే వారం జపాన్​లో జైశంకర్ పర్యటన

విదేశాంగ మంత్రి జైశంకర్ జపాన్​లో పర్యటించనున్నారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో ఈ పర్యటన జరగనుందని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. జపాన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు తెలిపింది. దీంతోపాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు- ఓఎన్​జీసీ 4% డౌన్​

మందకొడిగా సాగిన సెషన్​లో స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్​గా ముగిశాయి. సెన్సెక్స్ 37,973 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 11,222 వద్ద సెషన్​ను ముగించింది. 30 షేర్ల ఇండెక్స్​లో ఓఎన్​జీసీ దాదాపు 4 శాతం నష్టపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్‌లో 'అమ్నెస్టీ' కార్యకలాపాలు బంద్

కేంద్ర ప్రభుత్వం నిరాధార ఆరోపణలపై తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తోందని ఆవేదన వ్యక్తంచేసింది అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌. భారత్​లో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐపీఎల్​ చరిత్రలో బుమ్రా తొలిసారి ఇలా!

ఐపీఎల్​లో సూపర్​ ఓవర్​కు దారితీసిన మ్యాచుల్లో బుమ్రా బౌలింగ్​ చేయగా ముంబయి ఇండియన్స్​ ఎప్పుడూ గెలుస్తూనే వచ్చింది. కానీ బెంగళూరు జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్​లోనే తొలిసారిగా పరాజయాన్ని చవిచూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ప్రేక్షకులకు 'నిశ్శబ్దం'గానే మంచి థ్రిల్​ ఇస్తుంది'

స్టార్​ హీరోయిన్​ అనుష్క విభిన్న పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. అక్టోబరు 2న అమెజాన్​ ప్రైమ్​లో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమంత్​ మధుకర్​ ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.